Pushpa Movie: 5 వ సారి ఆ రికార్డ్ కొట్టిన అల్లు అర్జున్..!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన 3 వ చిత్రం ”పుష్ప: ది రైజ్” శుక్రవారం (డిసెంబర్ 17) వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. అయితే మొదటి షో తోనే ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ నమోదైంది. అయినప్పటికీ అల్లు అర్జున్ నటన మరియు యాక్షన్ సన్నివేశాలకు సినీ అభిమానులు ఫిదా అయిపోయారు అనే చెప్పాలి. దాంతో సినిమా భారాన్ని మొత్తం బన్నీ ఇమేజ్ పైనే ఆధారపడాల్సి వచ్చింది.

ఈ క్రమంలో ఫస్ట్ డే భారీ ఓపెనింగ్స్ నమోదయ్యాయి. పుష్ప: ది రైజ్’ సినిమా మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ.36 కోట్ల పైనే షేర్ నమోదు అయ్యింది.ఇది 2021 కి గాను ఇండియాలోనే తొలి రోజు అత్యధిక షేర్ అని చెప్పొచ్చు. ఒక్క నైజామ్ ఏరియాలో దాదాపు 10 కోట్ల పైనే షేర్ క‌లెక్ట్ చేసి, ఆ ఏరియాలోనే విడుద‌లైన తొలిరోజునే అత్య‌ధిక వ‌సూళ్ల రాబ‌ట్టిన సినిమాగా స‌రికొత్త రికార్డు సృష్టించింది.

ఇక ఓవర్సీస్ లో కూడా ఈ చిత్రం అసాధారణమైన కలెక్షన్లు రాబాడుతూ దూసుకుపోతుంది. ప్రీమియర్స్ తో 543K డాలర్లు, డే 1 426K డాలర్లు, 2 వ రోజు మధ్యాహ్నం నాటికి 56K డాలర్ల తో 1 మిలియన్ కంప్లీట్ చేసింది పుష్ప. బన్నీ కి ఇది 5 వ 1 మిలియన్ మూవీ. ఈ ఏడాది ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన చిత్రాల్లో ఇది 4 వ చిత్రం కావడం విశేషం. సుకుమార్ సినిమాలకి అక్కడ భారీ క్రేజ్ ఉంది అన్న సంగతి తెలిసిందే. అందుకే ఈ ఫీట్ సాధ్యమైందని తెలుస్తుంది.

పుష్ప: ది రైజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘పుష్ప’ చిత్రంలో ఆకర్షించే అంశాలు..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!
పవర్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ అంటే చూపించిన 11 మంది టాలీవుడ్ స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus