Allu Arjun, Jr NTR: ‘పుష్ప’ ఆ మూవీ కథ స్ఫూర్తితో తెరకెక్కిందా..!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా స్టైలిష్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన మూడవ చిత్రం ‘పుష్ప’. ‘మైత్రి మూవీ మేకర్స్’ ‘ముత్తంశెట్టి మీడియా’ సంస్థలు కలిసి నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 17న విడుదల కాబోతుంది. ‘అఖండ’ తో టాలీవుడ్ గాడిలో పడిన నేపథ్యంలో… ‘పుష్ప’ కి కూడా బాగా హెల్ప్ అయ్యిందని స్పష్టమవుతుంది. బుకింగ్స్ కూడా ఫుల్ స్వింగ్ లో ఉన్నాయి. తాజాగా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తిచేసుకుంది ‘పుష్ప’. ఈ చిత్రానికి సెన్సార్ వారు కొన్ని కట్స్ తో యు/ఎ సెర్టిఫికెట్ ను జారీ చేశారు.

సెన్సార్ సభ్యులు ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ చెప్పడం మరో విశేషంగా చెప్పుకోవాలి. అయితే సెన్సార్ టీం నుండీ అందిన సమాచారం ప్రకారం.. ఈ చిత్రం కథ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కథ స్పూర్తితో తెరకెక్కినట్టు తెలుస్తుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ‘పుష్ప’ కథ ఎన్టీఆర్ సూపర్ హిట్ మూవీ ‘బృందావనం’ కి స్ఫూర్తని తెలుస్తుంది. ‘బృందావనం’ లో కోటశ్రీనివాసరావు పెద్ద కొడుకుగా ప్రకాష్ రాజ్ నటిస్తే.. రెండో కొడుకుగా శ్రీహరి నటించాడు.

అయితే శ్రీహరి ఈ చిత్రంలో కోటా శ్రీనివాసరావు రెండో భార్య కొడుకుగా నటించాడు.ఈ చిత్రంలో కోటా శ్రీనివాసరావు రెండో పెళ్లి చేసుకోవడం ప్రకాష్ రాజ్ కు నచ్చదు. అందుకోసం తన సవతి తమ్ముడు అయిన శ్రీహరిని బయటకి గెంటేస్తాడు. సరిగ్గా ఇదే పాయింట్ తో ‘పుష్ప’ రూపొందిందట. ఇందులో శ్రీహరి ప్లేస్ లో అల్లు అర్జున్ ఉంటాడట. అతని ఇంట్లో వాళ్ళు ఇతన్ని కాదని గెంటేస్తే… మంగళం శ్రీను వద్ద చేరి ఎర్ర చందనం స్మగ్లింగ్ చేసే గ్యాంగ్ లో చేరతాడట.

సెకండ్ హాఫ్ లో అతన్ని గెంటేసిన ఫ్యామిలీ రోడ్డున పడే స్టేజిలో పుష్ప వారిని ఆదుకుంటాడట. ఇక్కడ ఇంటర్వెల్ దగ్గర ఒక ట్విస్ట్. కాలి వేళ్ళకి సంబంధించిన ఓ ఎపిసోడ్ ఉంటుందట.క్లైమాక్స్ కి ‘పుష్ప’ డాన్ అవుతాడని.. సెకండ్ పార్ట్ చైనా నేపథ్యంలో సాగుతుందని అక్కడ ‘పుష్ప’ కి బన్వర్ సింగ్ షెకావత్(ఫహద్ ఫాజిల్ కలుస్తాడని) తెలుస్తుంది.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus