Pushpa, RRR Movie: ‘పుష్ప’ ప్రమోషన్స్‌ టీమ్‌ ఆలోచనలు మారడం లేదా!

సినిమాలు, టేకింగ్‌ విషయంలో రాజమౌళి కొన్నిసార్లు సుకుమార్‌ను ఫాలో అవుతుంటారు. ఈ మాట మేం అనడం కాదు… ఒకసారి రాజమౌళినే ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ‘వన్‌’ సినిమాలో క్లోజ్‌ షాట్‌లు, ‘ఆర్య’లో గాల్లోకి ఫైటర్లు ఎగిరే సీన్‌ను స్ఫూర్తిగా తీసుకొని తన సినిమాల్లో రాసుకున్నా అని చెప్పారు. అది పక్కపెడితే… ఇప్పుడు రాజమౌళి సినిమాల ప్రచార స్ట్రాటజీని సుకుమార్‌ ఫాలో అవుతున్నారా? అవుననే అనిపిస్తోంది తాజా పరిణామాలు చూస్తుంటే…అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ తెరకెక్కిస్తున్న పాన్‌ ఇండియా సినిమా ‘పుష్ప’.

ఈ సినిమా తొలి పార్ట్‌ డిసెంబరు 17న విడుదల అవుతోంది. ఈ సినిమా ప్రచారం చూస్తే… రాజమౌళి సినిమాల ప్రచారానికి దగ్గరగా కనిపిస్తోంది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ వీడియో వస్తే, ‘పుష్ప’ వీడియో వస్తుంది. ఆ సినిమా పోస్టర్‌ వస్తే, ఈ సినిమా పోస్టర్‌ వస్తుంది. ఇలా కొన్ని కామన్‌ విషయాలు ఉంటూ వస్తున్నాయి. తాజాగా మరో విషయంలోనూ కామన్‌ పాయింట్‌ కనిపిస్తోంది.‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా ప్రచారం కోసం రాజమౌళి దుబాయిలో ఓ ప్రమోషనల్‌ ఈవెంట్‌ ప్లాన్‌ చేస్తున్నారని ఆ మధ్య వార్తలొచ్చాయి.

అయితే ఆ తర్వాత దాని గురించి ఎలాంటి సమాచారం లేదు. ఇప్పుడు ‘పుష్ప’ టీమ్‌ కూడా అలాంటి ఆలోచనలోనే ఉంది అంటున్నారు. దుబాయిలో భారీ స్థాయిలో ఈవెంట్‌ ఏర్పాటు చేసి… ప్రపంచవ్యాప్త దృష్టిని తమ సినిమాను వైపు తిప్పుకునే ప్రయత్నాల్లో సుకుమార్‌ – అల్లు అర్జున్‌ పీఆర్‌ టీమ్‌ ఉందట. సో… మీరు ఏం చేస్తే మేమూ అలాంటిదే చేస్తాం. అదన్నమాట కాన్సెప్ట్‌.

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus