Pushpa Movie: పుష్ప సెకండ్ పార్ట్ టైటిల్ ఏమిటంటే?

అల్లు అర్జున్ కథానాయకుడిగా తెరకెక్కిన మొదటి పాన్ ఇండియా సినిమా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన విషయం తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా ఐదు భాషల్లో విడుదల అయ్యింది. అయితే సినిమాకు సంబంధించిన అనేక రకాల అంశాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ప్రస్తుతం సినిమాకు నెగెటివ్ టాక్ వచ్చిందా లేక పాజిటివ్ టాక్ వచ్చిందా విషయంలో కొంత కన్ఫ్యూజన్ అయితే నెలకొంది.

సినిమాలో హీరో పాత్ర అయితే చాలా బాగుంది అని అల్లు అర్జున్ విషయంలో మాత్రం అభిమానులు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. కథా కథనం విషయంలో మాత్రం సుకుమార్ అభిమానులు సంతృప్తి చెందలేదు అనే కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఇక అసలు మ్యాటర్ లోకి వస్తే సినిమాకు సంబంధించిన టైటిల్ విషయంలో మరో ఆసక్తికరమైన అంశం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. పుష్ప మొదటి భాగానికి పుష్ప ద రైజ్ అనే టైటిల్ సెట్ చేసిన సుకుమార్

ఇప్పుడు రెండో భాగానికి “పుష్ప: ది రూల్” అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్లు క్లారిటీ ఇచ్చేశాడు. పుష్ప ఫస్ట్ పార్ట్ ఎండింగ్ లో అదే విషయాన్ని క్లారిటీ ఇవ్వడంతో ఇప్పుడు అందుకు సంబంధించిన టైటిల్ పై కూడా సోషల్ మీడియాలో అనేక రకాల కామెంట్స్ అయితే వెలువడుతున్నాయి. ఒక సామ్రాజ్యాన్ని ఏర్పరుచుకున్న పుష్ప ఆ తర్వాత దాన్ని ఎలా రూలింగ్ చేస్తాడు అనేది ఆసక్తికరంగా మారుతుందట. సెకండ్ పార్ట్ లో ఫహాద్ ఫాజిల్ అతి భయంకరమైన పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు.

అతని పాత్ర బల్వీర్ సీంగ్ షికావత్ నుంచి పుష్పరాజ్ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు అనేది కూడా ఆసక్తిని కలిగిస్తుందట. ఇక పుష్ప రెండవ భాగానికి సంబంధించిన షూటింగ్ పనులు దాదాపు సగానికిపైగా పూర్తయ్యాయి. ఇక మిగతా 20 శాతం పూర్తి చేస్తే సినిమా మొత్తం రెడీ అవుతుంది. అయితే పుష్ప ది రూల్ సినిమాను వచ్చే ఏడాది దసరా సమయంలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

పుష్ప: ది రైజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘పుష్ప’ చిత్రంలో ఆకర్షించే అంశాలు..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!
పవర్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ అంటే చూపించిన 11 మంది టాలీవుడ్ స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus