Allu Arjun: ఆ మ్యాజిక్ ను బన్నీ రిపీట్ చేస్తారా?

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ నాన్నకు ప్రేమతో, రంగస్థలం సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్లను అందుకున్నారు. పుష్ప సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతుండగా పుష్ప పార్ట్1 షూటింగ్ దాదాపుగా పూర్తైంది. అయితే కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ వల్ల ఈ సినిమా బడ్జెట్ భారీగా పెరిగిందని తెలుస్తోంది. మొదట నిర్మాతలు నిర్ణయించిన బడ్జెట్ తో పోలిస్తే పాతిక శాతం ఎక్కువ మొత్తం ఈ సినిమాకు ఖర్చవుతోందని సమాచారం.

అటు బన్నీ ఇటు సుకుమార్ కెరీర్ లో హైయెస్ట్ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుండగా బాక్సాఫీస్ వద్ద పుష్ప ఇండస్ట్రీ హిట్ గా నిలుస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అల వైకుంఠపురములో సినిమాతో ఇండస్ట్రీ హిట్ ఖాతాలో వేసుకున్న బన్నీ పుష్ప పార్ట్1తో ఆ మ్యాజిక్ రిపీట్ చేస్తారని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. అయితే బడ్జెట్ పెరిగినా ఈ సినిమాకు భారీగానే బిజినెస్ జరుగుతోంది. మరోవైపు నిర్మాతలు ఈ సినిమాకు సంబంధించి ఒకింత టెన్షన్ పడుతున్నారని సమాచారం.

మూడు పాటలు మినహా ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగా నేషనల్ క్రష్ రష్మిక ఈ సినిమాలో డీ గ్లామరస్ గా కనిపిస్తున్నారు. మరో రెండు వారాల్లో ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఫహద్ ఫాజిల్ ఈ సినిమాలో విలన్ రోల్ లో నటిస్తున్నారు. ఈ సినిమాలో రగ్డ్ లుక్ లో కనిపిస్తూ బన్నీ ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తున్నారు. బన్నీ ఎంతో కష్టపడి నటిస్తున్న పుష్ప బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటుందో చూడాల్సి ఉంది.

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus