ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా నార్త్ లో కూడా ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇప్పుడు ఈ సినిమాను రష్యాలో విడుదల చేశారు. ఈరోజే రిలీజ్ అయింది. ఓ తెలుగు సినిమా రష్యాలో ఇంత భారీ ఎత్తున రిలీజ్ కావడం ఇదే తొలిసారి. ఈ సినిమా ప్రచారం కోసం బన్నీ, సుకుమార్, రష్మిక ఇలా టీమ్ మొత్తం రష్యాకు వెళ్లింది.
ఇంటర్వ్యూలు, ఫ్యాన్స్ మీట్స్ అంటూ బాగానే ప్రచారాల్లో పాల్గొన్నారు. ఇప్పుడు ఈ సినిమా రెస్పాన్స్ కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఈ ప్రచారం కోసం రూ.5 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం. ఓ తెలుగు సినిమాను విదేశాల్లో ప్రచారం చేసుకోవడం చాలా ముఖ్యం. కాకపోతే.. రూ.5 కొల్తు అనేది చాలా ఎక్కువని ఇండస్ట్రీ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. ఎందుకంటే రష్యాలో తెలుగు సినిమా ఆడిన దాఖలాలు లేవు. కనీసం ప్రచారం కోసం పెట్టిన డబ్బు తిరిగి వచ్చినా గొప్పే.
నిజానికి ‘పుష్ప’ ప్రమోషన్స్ కూడా రెండు, మూడు కోట్లలో పూర్తి చేయాలనుకున్నారు. కానీ బన్నీ టీమ్ నుంచి ఎక్కువ మంది సభ్యులు రష్యా పయనమవ్వడంతో బడ్జెట్ అనుకున్నదానికంటే ఎక్కువైంది. ‘పుష్ప’ సినిమా గనుక ఆడితే.. రష్యాలో తెలుగు సినిమాకి మార్కెట్ దొరికినట్లే. రీసెంట్ గా ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ జపాన్ కు వెళ్లింది. అక్కడ సినిమా కోసం బాగా ప్రచారం చేసింది.
రిజల్ట్ కూడా బాగానే వచ్చింది. అదే విధంగా ‘పుష్ప’కి కూడా రష్యాలో పేరొస్తే బన్నీ క్రేజ్ మరింత పెరుగుతుంది. ఇప్పుడు ఈ సినిమాకి పార్ట్ 2 రాబోతుంది. ఈసారి తెలుగుతో పాటు చాలా భాషల్లో ‘పుష్ప2’కి ఒకేసారి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మరి పార్ట్2 ఇంకెంత ప్రభంజనం సృష్టిస్తుందో చూడాలి!