సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన మూడవ చిత్రం పుష్ప సినిమా బాక్సాఫీస్ వద్ద మొత్తానికి భారీ స్థాయిలో కలెక్షన్స్ అందుకొని ఒక సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. తెలుగులో ఈ సినిమా తప్పకుండా సక్సెస్ అవుతుంది అని అందరూ అనుకున్నారు. కానీ హిందీ లో మాత్రం ఒక వారం నడిచిన కూడా గొప్ప అనే కామెంట్స్ కూడా చేశారు. ఎందుకంటే ఈ చిత్ర యూనిట్ సభ్యులు చివరి నిమిషంలో తొందర పడుతూనే హడావుడిగా రిలీజ్ చేశారు.
అసలు హిందీలో రిలీజ్ అవుతుందా లేదా అని ముందు రోజు వరకు కూడా ఎవరికి నమ్మకం లేదు. కానీ నిర్మాతలు చాకచక్యంగా ప్రమోషన్స్ లేకపోయినప్పటికీ కూడా హిందీలో భారీగానే విడుదల చేశారు. మొత్తానికి పుష్ప బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. అలాగే తమిళంలో కూడా పరవాలేదు అనే విధంగానే కలెక్షన్స్ రాబడుతుంది. అయితే అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా జనవరి 7వ తేదీన సందడి చేయబోతున్నట్లు అనేక రకాల కథనాలు వెలువడ్డాయి.
అంతేకాకుండా పోస్టర్లు కూడా వచ్చినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా ఈ విషయంపై అమెజాన్ ప్రైమ్ ట్విట్టర్ ద్వారా స్పెషల్గా క్లారిటీ ఇచ్చేసింది. ఇంకా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు అని తాము అఫీషియల్ గా కూడా క్లారిటీ ఇవ్వలేదు అని తెలియజేశారు. అమెజాన్ ప్రైమ్ అలా క్లారిటీ ఇవ్వడంతో మొత్తానికి పుష్ప సినిమా ఇప్పట్లో ఓటీటీలో వచ్చే అవకాశం లేదని అర్థమైంది. అంతేకాకుండా సినిమా హిందీలో ప్రస్తుతం భారీ స్థాయిలో కలెక్షన్స్ అందుకుంటోంది.
ఇప్పటివరకు 60 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు సమాచారం ఇక తెలుగు రాష్ట్రాల్లో నైజాం ఏరియాలో దాదాపు బ్రేక్ ఈవెన్ పూర్తి చేసిన పుష్ప రాజ్ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఇంకా కొన్ని ఏరియాల్లో టార్గెట్ ను ఫినిష్ చేయాల్సి ఉంది.