అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన పుష్ప1 మూవీ అంచనాలను మించి సక్సెస్ సాధించింది. రిలీజైన మూడు వారాల తర్వాత అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ అయిన సంగతి తెలిసిందే. అయితే పుష్ప2 మూవీ వచ్చే ఏడాది ఆగష్టు నెల 15వ తేదీన థియేటర్లలో విడుదల కానుండగా ఈ సినిమాకు సంబంధించి షాకింగ్ అప్ డేట్ వచ్చింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేసిందని తెలుస్తోంది.
సాధారణంగా రెండు భాగాలుగా తెరకెక్కుతున్న సినిమాలు ఒకే ఓటీటీలో స్ట్రీమింగ్ కావడం జరుగుతుంది. అయితే పుష్ప సిరీస్ విషయంలో మాత్రం ఇందుకు భిన్నంగా జరిగింది. నెట్ ఫ్లిక్స్ భారీ మొత్తంలో ఆఫర్ చేయడం వల్లే పుష్ప2 సినిమా డిజిటల్ హక్కులు నెట్ ఫ్లిక్స్ సొంతమయ్యాయని తెలుస్తోంది. ఈ హక్కుల కోసం నెట్ ఫ్లిక్స్ ఎంత మొత్తం ఆఫర్ చేసేందనే ప్రశ్నకు సంబంధించి జవాబు దొరకాల్సి ఉంది.
ఇప్పటికే ఎన్నో క్రేజీ సినిమాల హక్కులను కొనుగోలు చేసిన నెట్ ఫ్లిక్స్ రాబోయే రోజుల్లో సైతం మరిన్ని భారీ సినిమాల హక్కుల కొనుగోలు దిశగా నెట్ ఫ్లిక్స్ అడుగులు పడుతున్నాయని సమాచారం అందుతోంది. నెట్ ఫ్లిక్స్ ఇతర ఓటీటీలకు గట్టి పోటీ ఇస్తుండటం గమనార్హం. దేవర డిజిటల్ హక్కులు సైతం నెట్ ఫ్లిక్స్ సొంతమయ్యాయని వార్తలు వినిపిస్తున్నాయి. నెట్ ఫ్లిక్స్ రాబోయే రోజుల్లో దేశంలో నంబర్ వన్ ఓటీటీగా నిలుస్తుందేమో చూడాలి.
సౌత్ సినిమాలకు దేశ విదేశాల్లో మంచి రెస్పాన్స్ అందుతుండటంతో నెట్ ఫ్లిక్స్ ఎక్కువ మొత్తం బడ్జెట్ ను కేటాయించిందని సమాచారం అందుతోంది. నెట్ ఫ్లిక్స్ రేంజ్ రాబోయే రోజుల్లో ఏ స్థాయిలో పెరుగుతుందో చూడాల్సి ఉంది. పుష్ప2 సినిమా హక్కులను నెట్ ఫ్లిక్స్ ఎక్కువ మొత్తానికి కొనుగోలు చేసిన నేపథ్యంలో రిలీజైన తర్వాత ఎన్ని వారాలకు ఈ సినిమా (Pushpa2) ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందో చూడాల్సి ఉంది.