‘బాహుబలి’ సినిమా వచ్చాక ఇన్ని రోజులకు రాశీ ఖన్నా ఈ విషయం తెలిపింది. ఓ ఇంటర్వ్యూలో భాగంగా రాశీ ఖన్నా ఈ వివరాలు చెప్పింది. ‘బాహుబలి’ సినిమాలో అవంతిక అలియాస్ తమన్నా పాత్ర కోసం ఆడిషన్ ఇచ్చానని, అయితే ఆ పాత్రకు నేను సరిపోను అని రాజమౌళి తిరస్కరించారని చెప్పింది. అంతేకాదు తన మిత్రుడు ఒకరు ఓ సినిమా చేస్తున్నారని, ఆ పాత్ర నీకు బాగుంటుంది అని చెప్పారట. ఆ మిత్రుడు సాయి కొర్రపాటి అయితే, ఆ సినిమా ‘ఊహలు గుసగుసలాడే’.
తొలి తెలుగు సినిమా ‘ఊహలు గుసగుసలాడే’తో రాశీ ఖన్నాకి మంచి పేరే వచ్చింది. అయితే అదే ‘బాహుబలి’ సినిమా తొలి అవకాశం అయి ఉంటే.. ఇంకా బాగుండేది అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అంతేకాదు దక్షిణాది సినిమాల గురించి అప్పట్లో తనకున్న ఆలోచన గురించి కూడా రాశీ ఖన్నా చెప్పింది. దక్షిణాది సినిమాలంటే పాటలు, డ్యాన్స్ అనే భావన ఉండేదని.. ‘ఊహలు గుసగుసలాడే’ సినిమా చేసిన తర్వాత తనకు మంచి పేరు వచ్చిందని తెలిపింది.
తెలుగులో ఆమె చివరిగా నటించిన ‘థ్యాంక్యూ’ సినిమా సరైన ఫలితం అందుకోలేదు. అలాగే తమిళంలో చేసిన ఆఖరి సినిమా ‘తిరుచిత్రాంబళం’ (తిరు) మంచి విజయం అందుకుంది. అయితే ఇటీవల తెలుగులో పెద్దగా అవకాశాలు సంపాదించలేకపోతున్న రాశీ ఖన్నా.. ‘ఫర్జీ’ అనే వెబ్ సిరీస్‌లో మంచి పేరు తెచ్చుకుంది. ఈ క్రమంలో తెలుగులో ఛాన్స్‌ల కోసం ప్రయత్నాలు చేస్తోందని సమాచారం.
ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!
స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!