‘చిరుత’ ‘మగధీర’ లతో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ అందుకున్న రాంచరణ్ కు ‘ఆరెంజ్’ సినిమా రూపంలో ఓ డిజాస్టర్ ఎదురైంది. అది ఫ్యాన్స్ ను నిరాశపరిచింది కానీ.. ఆ మూవీకి ఫ్యాన్స్ మాత్రం చాలా మంది ఉన్నారు. ఆ మూవీ తర్వాత చరణ్…’మెగా సూపర్ గుడ్ ఫిలింస్’ బ్యానర్ పై ‘మెరుపు’ అనే చిత్రాన్ని చేయడానికి ఓకె చెప్పాడు. ఈ మూవీ 10 శాతం షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకుంది.’బంగారం’ ఫేమ్ ధరణి దర్శకుడు.
కానీ కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్టు ఆగిపోయింది. దాంతో అదే బ్యానర్లో ‘రచ్చ’ చేయడానికి చరణ్ రెడీ అయ్యాడు. కేవలం ఒక్క సినిమా అనుభవం ఉన్న సంపత్ నంది ఈ చిత్రానికి దర్శకుడు. దాంతో మొదట్లో ఈ ప్రాజెక్టు పై ఎవ్వరికీ పెద్దగా అంచనాలు లేవు. 2012 ఏప్రిల్ 5న ఈ చిత్రం రిలీజ్ అయ్యింది. మొదటి షోతోనే సినిమాకి హిట్ టాక్ లభించింది. మాస్ ఆడియెన్స్ కు ఈ మూవీ బాగా నచ్చింది.
రొటీన్ స్టోరీనే అయినప్పటికీ చరణ్ అభిమానులకి కావాల్సిన ఎలిమెంట్స్ అన్నీ ఈ మూవీలో ఉన్నాయి. మణిశర్మ సంగీతం కూడా ఈ సినిమాకి బాగా హెల్ప్ అయ్యింది. నేటితో ఈ చిత్రం విడుదలై 10 ఏళ్ళు పూర్తికావస్తోంది. మరి ఫుల్ రన్లో ఈ మూవీ ఎంత కలెక్ట్ చేసిందనే విషయం పై ఓ లుక్కేద్దాం రండి :
నైజాం
11.60 cr
సీడెడ్
8.25 cr
ఉత్తరాంధ్ర
4.40 cr
ఈస్ట్
2.92 cr
వెస్ట్
2.46 cr
గుంటూరు
3.85 cr
కృష్ణా
2.50 cr
నెల్లూరు
2.05 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
38.03 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా
5.15 cr
తమిళ్ + మలయాళం
2.20 cr
ఓవర్సీస్
1.82 cr
వరల్డ్ వైడ్ (టోటల్)
47.20 cr
‘రచ్చ’ చిత్రానికి రూ.38.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ మూవీ రూ.47.20 కోట్ల షేర్ ను రాబట్టింది. బయ్యర్స్ కు ఈ మూవీ రూ.7.5 కోట్ల లాభాలను అందించి కమర్షియల్ హిట్ మూవీగా నిలిచింది.