ఎంత పెద్ద స్టార్ హీరో అయినా కూడా సినిమా హిట్టవ్వాలి అంటే ఎదో ఒక రకంగా బజ్ ఉంటేనే జనాలు ఎట్రాక్ట్ అవుతారు. చాలా వరకు పెద్ద సినిమాలకు గ్యాప్ లేకుండా ఎప్పటికప్పుడు బజ్ క్రియేట్ చేయడం ఈ రోజుల్లో కామన్ గా వస్తున్నదే. అయితే ప్రభాస్ తో వర్క్ చేసే యూవీ నిర్మాతలు మాత్రం అసలు కొంచెం కూడా పట్టనట్లు వ్యవహరిస్తుండటం విశేషం. రాదేశ్యామ్ సినిమా సెట్స్ పైకి వచ్చి రెండేళ్లవుతున్నా సరైన బజ్ లేదు.
కేవలం ప్రభాస్ ఉన్నాడన్న విషయం తప్పితే సినిమాకు మరో రూట్లో వచ్చిన పాజిటివ్ కామెంట్స్ లేవు. ఇప్పటివరకు రిలీజ్ చేసిన పోస్టర్స్ గాని టీజర్ గాని అంతగా క్లిక్కవ్వలేదు. కరోనా సాకుతో ఇన్నాళ్లు ఎలాగోలా తప్పించుకున్నారు. ఇక లాక్ డౌన్ అనంతరమైనా ఒక సాంగ్ ను విడుదల చేస్తారేమో అని అందరూ ఎదురుచూస్తున్నారు. ఇక ప్రభాస్ ను నమ్ముకొని సినిమా ఓటీటీ శాటిలైట్ హక్కుల కోసం కొన్ని సంస్థలు భారీ ఆఫర్స్ ప్రకటిస్తున్నాయి.
మొత్తంగా నాన్ థియేట్రికల్ గా సినిమాకు మంచి లాభాలు వచ్చినట్లు తెలుస్తోంది. సాహో, బాహుబలి కంటే ఎక్కువ ఎమౌంట్స్ వచ్చినట్లు టాక్. అంటే RRR తరువాత నాన్ థియేట్రికల్ గా భారీ స్థాయిలో బిజినెస్ చేసిన సినిమాగా రాధేశ్యామ్ నిలవనున్నట్లు సమాచారం. మరి సినిమా థియేట్రికల్ గా ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. రాధేశ్యామ్ తో పాటు ఆదిపురుష్ , సలార్ సినిమాలకు కూడా మంచి బిజినెస్ డీల్స్ వస్తున్నట్లు తెలుస్తోంది.
Most Recommended Video
తన 19 ఏళ్ళ కెరీర్ లో నితిన్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వింటేజ్ ఫిల్మ్ ఫేర్ కవర్స్ పై మన తారలు!
టాలీవుడ్లో రీమేక్ అయిన ఈ 9 సినిమాలు..తమిళంలో విజయ్ నటించినవే..!