Radhe Shyam Movie: వాళ్లతో నెగ్గలేకపోయిన ప్రభాస్ నిర్మాతలు!

ప్రభాస్ హీరోగా దర్శకుడు రాధాకృష్ణ కుమార్ ‘రాధేశ్యామ్’ సినిమాను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టి చాలా కాలమవుతున్నా.. ఇప్పటికీ కొంత షూటింగ్ బ్యాలెన్స్ ఉందని తెలుస్తోంది. మొన్నటివరకు ఈ సినిమాకి సంబంధించి ఓ డైలమా కొనసాగిన సంగతి తెలిసిందే. సినిమా టాకీ పార్ట్ మొత్తం పూర్తికాగా.. ఒక పాట బ్యాలెన్స్ ఉంది. దీన్ని చిత్రీకరించాలా..? వద్దా..? అనే విషయంపై నార్త్ డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలకు మధ్య చిన్నపాటి డిస్కషన్ జరిగింది.

ఫైనల్ గా ఈ చర్చల్లో నార్త్ బయ్యర్లే విజయం సాధించారు. ‘రాధేశ్యామ్’ సినిమాకు సంబంధించి ప్రభాస్-పూజాహెగ్డే మధ్య ఓ సాంగ్ బ్యాలెన్స్ ఉంది. దాన్ని వదిలేసి, ప్యాచ్ వర్క్ పూర్తిచేసి గుమ్మడికాయ కొట్టేద్దామని యూనిట్ భావించింది. ఇప్పటికే బడ్జెట్ అనుకున్న దానికంటే ఎక్కువ అవ్వడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే మిగిలిన ఆ ఒక్క పాట పెట్టడం వలన సినిమాకు ఉత్తరాదిక మైలేజీ పెరుగుతుందని.. కాబట్టి కచ్చితంగా పాట పెట్టాల్సిందేనంటూ టీసిరీస్ పట్టుబడుతోంది.

కొన్నాళ్లుగా ఈ విషయంపై చర్చలు జరుగుతుండగా.. ఫైనల్ గా ఓ నిర్ణయానికి వచ్చారు. మిగిలిన ఆ ఒక్క పాటను కూడా షూట్ చేయాలని యూనిట్ నిర్ణయించుకుంది. సినిమాకి సంబంధించిన మరో ఎనిమిది నుండి పది రోజుల షూటింగ్ పెండింగ్ ఉంది. అది పూర్తి చేసే లోపు సెకండ్ వేవ్ వచ్చింది. పరిస్థితులు అనుకూలిస్తే వచ్చే నెల మూడో వారానికి ఆ పెండింగ్ పార్ట్ ను పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

Most Recommended Video

టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?
ఈ 10 సినిమాల్లో కనిపించని పాత్రలను గమనించారా?
2020 లో పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కానీ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus