సినీ పరిశ్రమలో విషాదాల సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదు. ఈ ఏడాది చూసుకుంటే చాలా మంది సినీ సెలబ్రిటీలు ప్రాణాలు కోల్పోయారు. అందులో స్టార్ డైరెక్టర్ ఏ.ఎస్.రవికుమార్ చౌదరి, దిగ్గజ నటులు కోటా శ్రీనివాసరావు వంటి వాళ్ళు ఉండటం బాధాకరం. టాలీవుడ్లోనే కాదు పక్క రాష్ట్రాల్లోని సినీ సెలబ్రిటీలు కూడా చాలా మంది మృత్యువాత చెందారు. ఏదో ఒక కారణంతో నిత్యం ఎవరొకరు మరణిస్తూనే ఉన్నారు. తాజాగా మరో బ్యాడ్ న్యూస్ వినాల్సి వచ్చింది.
వివరాల్లోకి వెళితే.. సీనియర్ నటి రాధిక శరత్ కుమార్ కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రాధికా తల్లి గీత ఈరోజు మరణించారు. ఆమె వయస్సు 86 ఏళ్ళు అని తెలుస్తుంది. కొన్నాళ్ళుగా అనారోగ్య సమస్యలతో పాటు వయసు సంబంధిత సమస్యలు కూడా ఆమెను ఇబ్బంది పెడుతూ వచ్చాయట. నిన్న పరిస్థితి విషమించడంతో అర్ధరాత్రి కన్నుమూసినట్టు తెలుస్తుంది.
ఈ విషయాన్ని స్వయంగా రాధిక కుటుంబ సభ్యులు వెల్లడించారు. గీత కూడా సినీ నటిగా ఓ వెలుగు వెలిగారు అనే సంగతి చాలా మందికి తెలిసుండదు. తమిళ సినిమాల్లో విలక్షణ నటిగా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. రాధిక హీరోయిన్ గా నిలబడటంతో కూడా తల్లి గీత కృషి ఎంతో ఉంది అని తెలుస్తుంది. ఇక ఆమె అంత్యక్రియలు ఈరోజు అనగా సెప్టెంబర్ 22న సాయంత్రం చెన్నైలో ఉన్న బేసెంట్ నగర్ శ్మశానవాటికలో నిర్వహించబోతున్నట్లు సమాచారం.
విషయం తెలుసుకున్న తర్వాత చిరంజీవి వంటి స్టార్లు రాధిక అలాగే శరత్ కుమార్..లకు ఫోన్లు చేసి సానుభూతి తెలిపినట్టు సమాచారం.