ఎంత స్టార్ దర్శకుడికి అయినా కొన్ని సార్లు బ్యాడ్ టైం నడుస్తుంటుంది. ఆ టైములో ఏ సినిమా చేసినా కలిసిరాదు. అలాంటి ఫేస్ లను రాఘవేంద్ర రావు గారు ఎన్నో సార్లు అనుభవించారు. 1988-1990 టైములో రాఘవేంద్ర రావు గారు చేసిన సినిమాలు ‘యుద్దభూమి’ ‘అగ్ని’ ‘రుద్రనేత్ర’ ‘ఒంటరి పోరాటం’ వంటివి బాక్సాఫీస్ వద్ద అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేదు.ఆ టైములో రాఘవేంద్ర రావు గారి పై చాలా సెటైర్లు పడ్డాయి.
అలాంటి టైములో ఆయన మోహన్ బాబుని హీరోగా పెట్టి సినిమా చేయడానికి రెడీ అయ్యారు. అందులోనూ ఆ సినిమాలో రమ్యకృష్ణని ఓ హీరోయిన్ గా ఎంపిక చేసుకున్నారు. అదే ‘అల్లుడుగారు’ సినిమా. ఇంకేముంది రాఘవేంద్ర రావు గారి పై ఆ సెటైర్లు మరింత పెరిగాయి. రాఘవేంద్ర రావు గారికి ముందుగా అడ్వాన్స్ ఇచ్చిన నిర్మాత కూడా ఈ కాంబినేషన్ కు నేను సిద్ధంగా లేను అని తప్పుకున్నాడు. అదే టైములో ఓ స్టార్ హీరో కూడా మోహన్ బాబుతో సినిమా చేయొద్దు..
మీ కెరీర్ ను పాడుచేసుకోకండి అని రాఘవేంద్ర రావుకి సూచించాడట. ఈయన హీరోగా చేసిన సినిమాలకి రాఘవేంద్ర రావు గారు దర్శకత్వం వహించడం వాటిలో మోహన్ బాబు నెగిటివ్ రోల్స్ చేయడం కూడా జరిగింది. అయినప్పటికీ రాఘవేంద్ర రావు గారు ఆ స్టార్ హీరో కామెంట్స్ ను పట్టించుకోకుండా మొండి ధైర్యంతో ‘అల్లుడు గారు’ సినిమాని ఫినిష్ చేశారు. మోహన్ బాబే స్వయంగా తన ‘శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్’ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించారు.
1990 వ సంవత్సరం జూలై 14న విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ అయ్యింది. రమ్యకృష్ణ హీరోయిన్ గా నిలబడింది ఈ చిత్రంతోనే..! ఫైనల్ గా ఆ స్టార్ హీరో రాఘవేంద్ర రావు గారికి ఇచ్చిన సలహాలు కూడా వేస్ట్ అయిపోయాయి..!