ప్రముఖ సంగీత దర్శకుడు రఘు తండ్రి ఇక లేరు.!

  • January 19, 2023 / 10:21 AM IST

ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు, నటుడు అయిన రఘు కుంచె ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి లక్ష్మీ నారాయణ కుంచె (90) కన్నుమూశారు. మంగళవారం ఆయన తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గత కొంతకాలంలో వయో వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న లక్ష్మీనారాయణ తూర్పుగోదావరిలోని కోరుకొండ మండలం గాదరాడ గ్రామంలో ఉంటున్న రఘు తండ్రి.. స్వగృహంలోనే చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో మంగళవారం కన్నుమూశారు. దీంతో పరిశ్రమ వర్గాలు రఘు కుంచెకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాయి.

తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం గాదరాడ గ్రామానికి చెందిన లక్ష్మీనారాయణరావు కుంచె 1933లో జన్మించారు. ఆయనకు భార్య వరహాలమ్మ, కుమారుడు రఘు, ఇద్దరు కుమార్తెలున్నారు. లక్ష్మీనారాయణరావు అంత్యక్రియలు బుధవారం స్వగ్రామంలో నిర్వహించారు. జీవనోపాధి కోసం వ్యవసాయం చేసిన లక్ష్మీనారాయణరావు స్థానిక సాగునీటి సంఘ అధ్యక్షుడిగా కూడా చేశారు. దాంతోపాటు హోమియో వైద్యుడిగా సేవలందించారు. తండ్రి మరణాన్ని తెలియజేస్తూ రఘు కుంచె ‘మిస్‌యూ నాన్నా’ అంటూ ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు.

లక్ష్మీ నారాయణ హోమియో వైద్యుడుగా పనిచేసేవారు. చిన్నతనం నుండి రఘుకు సంగీతం మీద ఉన్న ఆసక్తిని గ్రహించి లక్ష్మీనారాయణ ఎంతగానో సపోర్ట్ చేశారట. ఆయన వల్లే నేను ఇండస్ట్రీలో ఉన్నాను అంటూరఘు ఎన్నోసార్లు చెప్పుకోచ్చారు. రఘు కుంచె విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన సింగర్‌, మ్యూజిక్‌ డైరక్టర్‌గా కొనసాగుతూనే నటుడిగానూ కొన్ని సినిమాల్లో చేస్తున్నారు. ‘పలాస’లో రఘు విలన్‌గా చేసిన విలన్‌ పాత్రకు మంచి మార్కులే పడ్డాయి. దాంతోపాటు అందులో ఆయన స్వరపరిచిన ‘నక్కిలీసు గొలుసు’ పాట ఎంత ఫేమస్‌ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus