బెయిల్ కోసం కోర్టుని విన్నవించుకున్న శిల్పాశెట్టి భర్త!

పోర్నోగ్రఫీ కేసులో ప్రముఖ నటి శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. నీలిచిత్రాలను నిర్మించి.. యాప్స్ ద్వారా ఆన్ లైన్ లో వినియోగంలో తెచ్చారని ఆరోపణలతో కుంద్రాను అరెస్ట్ చేశారు. అయితే ఆయన బెయిల్ కోసం ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకుంటున్నా.. కోర్టు నిరాకరిస్తుంది. తాజాగా మరోసారి బెయిల్ కోసం కోర్టులో దరఖాస్తు చేసుకున్నారు. ఛార్జ్ షీట్ లో తనకు వ్యతిరేకంగా ఒక్క సాక్ష్యం కూడా సమర్పించలేదని..

బెయిల్ ఇవ్వాలని కోర్టుని కుంద్రా కోరారు. ఈ కేసులో తనను బలిపశువుని చేశారని మెట్రోపాలిటన్ కోర్టులో వేసిన పిటిషన్ లో పేర్కొన్నారు. ప్రాక్టికల్ గా చూస్తే ఈ కేసులో క్రైమ్ బ్రాంచ్ పోలీసుల దర్యాప్తు ముగిసిపోయిందని కుంద్రా తరఫు న్యాయవాది ప్రశాంత్ పాటిల్ అభిప్రాయపడ్డారు. హాట్ షాట్స్ యాప్స్ లో ఉన్న ఏ ఒక్క ఆధారాన్ని పోలీసులు అనుబంధ ఛార్జ్ షీట్ లో పొందుపరచలేదని న్యాయవాది వివరించారు. నిజానికి సంబంధిత నటులే ఆయా వీడియోలను యాప్స్ లోకి అప్లోడ్ చేశారని అన్నారు.

పోలీసులు ఫిర్యాదులో పేర్కొన్నట్లుగా కుంద్రాకు వ్యతిరేకమగా అభియోగాలకు బలంచేకూర్చే ఎలాంటి ఆధారాలను లభించలేదని అన్నారు. ఎఫ్ఐఆర్ లో మొదట కుంద్రా పేరు లేదని.. పోలీసులే తరువాత యాడ్ చేశారని న్యాయవాది ఆరోపించారు.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

Share.