టాలీవుడ్ ఇండస్ట్రీలోని సక్సెస్ ఫుల్ డైరెక్టర్లలో రాజమౌళి ఒకరు. మగధీర సినిమా సక్సెస్ తో రాజమౌళి పేరు దేశమంతటా మారుమ్రోగింది. ఈ సినిమా అప్పట్లో 40 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిందని తెలిసి నెటిజన్లు సైతం ఆశ్చర్యపోయారు. టాలీవుడ్ మార్కెట్ ను పెంచిన సినిమాలలో మగధీర సినిమా కూడా ఒకటని చెప్పవచ్చు. ఈ సినిమా ఫుల్ రన్ లో దాదాపుగా 90 కోట్ల రూపాయల కలెక్షన్లను సొంతం చేసుకుంది.
అయితే చరణ్ ఒక సందర్భంలో ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. చిరుత సినిమా చివరి దశలో ఉన్న సమయంలో రాజమౌళి తనను కలిసి తనకు ఏమి వచ్చు అని అడగగా తాను హార్స్ రైడింగ్ వచ్చని గుర్రాలంటే ఇష్టమని చెప్పానని చరణ్ వెల్లడించారు. నెలరోజుల తర్వాత తనను మళ్లీ కలుస్తానని చెప్పి రాజమౌళి వెళ్లిపోయారని చరణ్ చెప్పుకొచ్చారు. గుర్రాలంటే తనకు ఇష్టమని చెప్పడంతో మగధీరలో జక్కన్నహార్స్ రైడింగ్ సీన్లు పెట్టారని చరణ్ వెల్లడించారు.
చరణ్, రాజమౌళి కాంబినేషన్ లో మగధీర తర్వాత ఆర్ఆర్ఆర్ తెరకెక్కగా ఈ సినిమా కూడా కమర్షియల్ గా సక్సెస్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమాకు అంచనాలకు మించి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు వస్తుండటం గమనార్హం. ఈ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్లలో ఆర్ఆర్ఆర్ ఒకటిగా నిలిచే అవకాశాలు ఉన్నాయి. పలు ఏరియాల్లో ఈ సినిమా బాహుబలి2 రికార్డులను బ్రేక్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్ఆర్ఆర్ సినిమా సక్సెస్ సాధించడం చరణ్, తారక్ కెరీర్ లకు ఒక విధంగా ప్లస్ అవుతోంది.
చరణ్, తారక్ ఈ సినిమాలో తమ అభినయంతో అద్భుతంగా మెప్పించారు. నార్త్ ఇండియాలో కూడా ఈ ఇద్దరు హీరోల పర్ఫామెన్స్ గురించి జోరుగా చర్చ జరుగుతోంది. చరణ్, తారక్ బాలీవుడ్ కల ఈ సినిమాతో నెరవేరినట్టేనని తెలుస్తోంది. రాజమౌళి మూడు గంటల నిడివితో సినిమాను తెరకెక్కించినా ప్రేక్షకులను మాత్రం మెప్పించడం గమనార్హం.