Rajamouli: క్షమాపణలు కోరిన రాజమౌళి.. కారణాలివే!

టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్స్ విషయంలో వేగం పెంచారు. వరుసగా ఈవెంట్లలో పాల్గొంటూ ఆర్ఆర్ఆర్ పై జక్కన్న అంచనాలను అంతకంతకూ పెంచుతున్నారు. శుక్రవారం రోజున ఈ సినిమా నుంచి విడుదలైన జనని సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. చెన్నై మీడియాకు జనని డబ్బింగ్ వెర్షన్ “ఉయిరే” పాటను ప్రత్యేకంగా ప్రదర్శించిన రాజమౌళి కోలీవుడ్ మీడియాను క్షమాపణలు కోరారు. గడిచిన మూడు సంవత్సరాలుగా ఒక్క ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేసి మీడియాను కలుసుకోలేకపోయానని అందుకే క్షమాపణలు కోరుతున్నానని రాజమౌళి చెప్పుకొచ్చారు.

డిసెంబర్ నెలలో మరో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మీడియా ప్రతినిధులు అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం ఇస్తానని రాజమౌళి కామెంట్లు చేశారు. ఆర్ఆర్ఆర్ సినిమాకు ఉయిరే పాట ఆత్మలాంటిదని జక్కన్న అన్నారు. కీరవాణి ఈ పాట కోసం రెండు నెలలు శ్రమించారని రాజమౌళి తెలిపారు. ఈ ఈవెంట్ ప్రమోషనల్ ఈవెంట్ కాదని మీడియా ప్రతినిధులకు పాటను చూపించాలనే ఏకైక ఉద్దేశంతో పాటను ప్రదర్శించామని జక్కన్న తెలిపారు. వచ్చే ఏడాది జనవరి నెల 7వ తేదీన రిలీజ్ కానున్న ఈ సినిమాను తమిళంలో సుభాస్కరన్ రిలీజ్ చేయనున్నారని తెలుస్తోంది.

జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమని కామెంట్లు వినిపిస్తున్నాయి. దాదాపుగా 500 కోట్ల రూపాయల బడ్జెట్ తో డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మించారు. 10,000కు పైగా స్క్రీన్లలో ఈ సినిమా రిలీజ్ కానుండగా త్వరలో ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ విడుదల కానుంది.

నాగ చైతన్య రిజెక్ట్ చేసిన 10 సినిమాల్లో 3 బ్లాక్ బస్టర్లు…!

Most Recommended Video

టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన 10 సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇవే..!
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
ఈ 15 మంది హీరోయిన్లు విలన్లుగా కనిపించిన సినిమాలు ఏంటో తెలుసా..?

Share.