స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ మూవీ బాక్సాఫీస్ వద్ద అంచనాలను మించి సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే. జపాన్ లో కూడా ఈ సినిమా భారీ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ మూవీ రిజల్ట్ గురించి రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అద్భుతమైన హీరోయిజం ఈ సినిమా సక్సెస్ కు కారణమని జక్కన్న కామెంట్లు చేయడం గమనార్హం. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది భారతీయులు ఉన్నారని భారతీయులు ఎక్కడ ఉన్నా ఆర్ఆర్ఆర్ సినిమాను ఆదరిస్తారని అనుకున్నానని ఆయన కామెంట్లు చేశారు.
అయితే విదేశీయులు కూడా ఈ సినిమాపై ఎంతో అభిమానం చూపిస్తున్నారని జక్కన్న వెల్లడించారు. ఇలా జరుగుతుందని నేను ఊహించలేదని రాజమౌళి చెప్పుకొచ్చారు. ఈ సినిమాలోని యాక్షన్ సీన్స్ కూడా ఈ సినిమా సక్సెస్ లో కీలక పాత్ర పోషించాయని రాజమౌళి అభిప్రాయపడ్డారు. మరోవైపు ఈ సినిమా ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంటూ ఉండటం గమనార్హం. ఈ సినిమా సక్సెస్ తో దేశవిదేశాల్లో తారక్, చరణ్ పేరు మారుమ్రోగింది. ఈ ఇద్దరు హీరోల భవిష్యత్తు ప్రాజెక్ట్ లకు సైతం రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుగుతోంది.
ఆర్.ఆర్.ఆర్ సక్సెస్ తో చరణ్, తారక్ గ్లోబల్ స్టార్స్ అయ్యారని మరి కొందరు కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు వైరల్ అవుతున్నాయి. చరణ్ ప్రస్తుతం శంకర్ డైరెక్షన్ లో ఒక సినిమాలో నటిస్తుండగా తారక్ ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్ లో ఒక సినిమాలో నటిస్తుండటం గమనార్హం. ఈ రెండు ప్రాజెక్ట్ లు పాన్ ఇండియా సినిమాలుగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి.
చరణ్, తారక్ తర్వాత సినిమాలతో కూడా భారీ బ్లాక్ బస్టర్ హిట్లను సొంతం చేసుకుంటామని కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. చరణ్, తారక్ లకు క్రేజ్ అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే. చరణ్, తారక్ కెరీర్ విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు.