మన టాలీవుడ్ పరిశ్రమలో బాహుబలి అన్న పదం పురుడు పోసుకుని దాదాపుగా 5ఏళ్లకు పైగానే అయ్యింది. అయితే ఇలా అయిదు ఏళ్లు పడుతుంది అని అసలు రాజమౌళి కూడా ఊహించి ఉండదు. అంతేకాకుండా ఇలా ఇన్నేళ్ళు పడుతుంది అనుకుంటే అసలు ఈ సినిమా తీసేవాన్నే కాదు అని అన్నాడు సాక్షాత్తూ రాజమౌళి ఒకానొక ఇంటర్వ్యూ లో . అదే క్రమంలో సినిమా పరంగా బహుబలిని రెండు భాగాల్లో బాగా చూపించాడు మన జక్కన్న. అంతేకాకుండా అంచనాలకు తగ్గట్టుగానే తీసి వారెవా అనిపించుకున్నాడు రాజమౌళి. అయితే ఏది ఎలా ఉన్నా బాహుబలి పార్ట్ 1 లానే పార్ట్ 2 కూడా బ్లాక్ బస్టెర్ హిట్స్ అందుకుని భారీ వసూళ్లకు శ్రీకారం చుట్టాయి. ఇదిలా ఉంటే ఈ కధ ఇక్కడితో ముగిసిందా? ఈ సినిమా ఇంతటితో పూర్తి అయ్యిందా? అంటే అవును అంటూనే కానీ బాహుబలి సీక్వల్స్ మాత్రం వస్తాయని అని అప్పట్లో సాక్షాత్తూ రాజమౌలీనే చెప్పాడు.
అంటే బాహుబలి 3, 4 అలా కూడా వచ్చే అవకాశాలున్నాయన్నమాట. అసలు బాహుబలి కొనసాగించే ఆలోచన ఉందా లేకపోతే అప్పట్లో ఎందుకు బాహుబలి మిగతా పార్టులు తీస్తానని అంటాడు. ఉంటే ఎప్పుడు అన్నది ప్రేక్షకుల ప్రశ్న. బాహుబలి తర్వాత సీక్వల్స్ తీస్తే హీరో ఎవరు మళ్లీ ప్రభాస్ తోనే తీస్తాడా లేక మరెవరినైనా సెలెక్ట్ చేస్తాడా ఇలా ఎన్నో డౌట్లు ఉన్నాయి. అయితే ఒకానోక ఇంటెర్వ్యు లో మాత్రం రాజమౌళి మాట్లాడుతూ యానిమేటెడ్ సీరీస్ రూపంలో, వివిధ పుస్తకాల రూపంలో, ఇంకా చెప్పాలి అంటే బాహుబలి ఆగదు అలా అని మరో సినిమా ఉండదు అని చెప్పాడు. మొత్తంగా చూసుకుంటే బహుబలి3 అయితే లేకపోవచ్చు కానీ… రకరకాల రూపల్లో మాత్రం బహుబలి అందరికీ చేరేలా పక్కా ప్లాన్ తో ఉన్నాడు జక్కన్న.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.