Ram Charan: బర్త్‌డే నాడు రాజమౌళి, రామ్ చరణ్‌కిచ్చిన స్పెషల్ గిఫ్ట్ ఏంటంటే..?

మార్చి 27 మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 38వ పుట్టినరోజు సందర్భంగా.. ఫ్యామిలీ మెంబర్స్, మెగా ఫ్యాన్స్, ఇండస్ట్రీ వర్గాల వారి విషెస్, కొత్త సినిమా (గేమ్ ఛేంజర్) అప్‌డేట్స్‌తో సోషల్ మీడియా షేక్ అయిపోయింది.. చరణ్ ‘ఆర్ఆర్ఆర్’ మూవీతో గ్లోబల్ స్టార్ ఇమేజ్ తెచ్చుకోవడం, ఇటీవల ‘నాటు నాటు’ పాటకు ప్రపంచ ప్రఖ్యాత ఆస్కార్ అవార్డ్ రావడం ఈ పుట్టినరోజు ప్రత్యేకం.. అలాగే బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ‘ఆరెంజ్’ స్పెషల్ షోలు వేయగా ఊహించని స్పందన వచ్చింది..

జనసేన ఫండ్ రైజింగ్ కోసం ప్రత్యేక ప్రదర్శనలు ఏర్పాటు చేయగా.. రూ. 75 లక్షలు కలెక్ట్ చేయడం విశేషం.. దీంతో చరణ్‌కి హిట్ ఇవ్వలేకపోయాననే లోటు తీరిపోయిందంటూ నాగబాబు చెప్పారు.. ఇక తనయుడి బర్త్‌డే సందర్భంగా చిరంజీవి ఇంట్లో ఇండస్ట్రీ వారికి, ఫ్రెండ్స్, వెల్ విషర్స్ అందరికీ గ్రాండ్ పార్టీ ఇచ్చారు.. రాజమౌళి ఫ్యామిలీ, కీరవాణి ఫ్యామిలీ, కార్తికేయ ఫ్యామిలీ, నాగార్జున ఫ్యామిలీ, వెంకటేష్, రానా, జగపతి బాబు, నిఖిల్, సుకుమార్, విజయ్ దేవరకొండ, కాజల్ కపుల్, జానీ మాస్టర్, మంచు లక్ష్మీ, మంచు మనోజ్, మౌనిక దంపతులు, థమన్, ప్రశాంత్ నీల్.. అలాగే ఇండస్ట్రీలోని పలు విభాగాలకు చెందిన వారంతో అటెండ్ అయ్యి..

చరణ్‌‌కి బర్త్‌డే విషెస్ తెలియజేశారు.. ఈ పార్టీకి సంబంధించిన పిక్స్, వీడియోస్ నెట్టింట వైరల్ అయ్యాయి.. ఈ సందర్భంలోనే ఆస్కార్ సాధించిన ‘ఆర్ఆర్ఆర్’ టీంని ఘనంగా సత్కరించారు మెగాస్టార్.. ఇక జక్కన్న, చరణ్‌కిచ్చిన గిఫ్ట్ గురించిన వార్తలు, వీడియో చక్కర్లు కొడుతున్నాయి..

సామాన్యంగా ఇలాంటి ఫంక్షన్లకు తక్కువగా హాజరయ్యే దర్శకధీరుడు ఒకవేళ వెళ్తే మాత్రం కచ్చితంగా ఖాళీ చేతులతో అయితే వెళ్లరు.. అలాగే చరణ్ (Ram Charan) కోసం సర్‌ప్రైజ్ గిఫ్ట్స్ తీసుకెళ్లారు.. రోజ్ వుడ్‌తో చేసిన ఓ యూనిక్ హ్యాండ్ మేడ్ లారీతో పాటు రోజ్ వుడ్‌తో చేసిన మరో అందమైన ప్రతిమను చెర్రీకి బహుమతిగా ఇచ్చారు రాజమౌళి..

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus