మహేష్ బాబు (Mahesh Babu) – పూరీ జగన్నాథ్ (Puri Jagannadh) కాంబినేషన్లో రెండు సినిమాలు వచ్చాయి. ఒకటి ‘పోకిరి’ (Pokiri) రెండోది బిజినెస్ మెన్ (Businessman). వీటిలో ‘పోకిరి’ ఇండస్ట్రీ హిట్ అయ్యింది. ‘బిజినెస్ మెన్’ కూడా సూపర్ హిట్ అయ్యింది. రెండిటికీ కల్ట్ స్టేటస్ ఉంది. రీ-రిలీజ్లో కూడా ఈ సినిమాలు రికార్డులు నెలకొల్పాయి. ఈ రెండు సినిమాలకు ఫస్ట్ అండ్ మెయిన్ హైలెట్ అంటే మహేష్ బాబు అనే చెప్పాలి. ఈ 2 సినిమాల్లోనూ మహేష్ బాబు చాలా డైనమిక్ గా కనిపిస్తాడు.
ఈ రెండు సినిమాల్లోని క్యారెక్టరైజేషన్స్ కూడా మహేష్ బాబు ఫ్యాన్స్ కి చాలా ఇష్టం. దర్శకుడు పూరీ జగన్నాథ్ ని ప్రజెంట్ చేసిన తీరు ఫ్యాన్స్ ని అమితంగా ఆకట్టుకుంది. మరోపక్క… ‘సక్సెస్ ఫుల్ సినిమా తీయడం ఎలా?’ అనే ఫార్ములాని వివరిస్తూ రాజమౌళి (Rajamouli) ఒక పుస్తకం రాసుకునేవాడట. తనతో టెన్నీస్ ఆడుకునే ఓ సీనియర్ జర్నలిస్ట్ తో ఈ విషయం గురించి చెప్పాడట. హీరో క్యారెక్టరైజేషన్ ఎలా ఉండాలి? అనే పాయింట్ దగ్గర్నుండి మాస్ ప్రేక్షకులు ఆశించే పాజిటివ్ అంశాల గురించి వర్ణిస్తూ రాజమౌళి (Rajamouli) ఆ పుస్తకం రాసుకున్నారట. ఇదంతా ‘బిజినెస్ మెన్’ సినిమా వచ్చేవరకు.
కానీ 2012 లో ‘బిజినెస్ మెన్’ సినిమా వచ్చింది. ఇందులో ప్రతి అంశం రాజమౌళి రాసుకున్న సక్సెస్ ఫార్ములాలకి విరుద్ధంగా ఉన్నాయట. ఈ సినిమాలో హీరో మంచోడు కాదు. చెడ్డగా ఉంటాడు.. చెడు మార్గంలో నడుస్తూ ఉంటాడు. దానికి ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ కూడా తగిలించారు. హీరో పాత్రతో చెప్పే డైలాగులు,ఫిలాసఫీ వంటివి కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. కానీ అవి కూడా ఆడ్ గానే ఉంటాయి.
అయినప్పటికీ ఆడియన్స్ ఆ సినిమాని ఆదరించారు. సినిమా సూపర్ హిట్ అయ్యింది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించింది. దీంతో రాజమౌళికి మైండ్ బ్లాక్ అయ్యిందట. వెంటనే తాను రాసుకున్న సక్సెస్ ఫార్ములా పుస్తకాన్ని చించి విసిరేశాడట రాజమౌళి. ఈ విషయాన్ని కూడా తన టెన్నీస్ మేట్ అయినటువంటి సీనియర్ జర్నలిస్ట్ తో రాజమౌళి చెప్పారట.