టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏ జానర్ లో సినిమా తెరకెక్కించినా ఆ సినిమా సక్సెస్ అయ్యేలా చేసే టాలెంట్ ఉన్న దర్శకుడు ఎవరనే ప్రశ్నకు రాజమౌళి పేరు సమాధానంగా వినిపిస్తుంది. మర్యాద రామన్న, ఈగ, బాహుబలి బాహుబలి2, ఆర్.ఆర్.ఆర్ తరహా ప్రయోగాలు చేయడం, ఆ ప్రయోగాలతో విజయాలను సాధించడం జక్కన్నకు మాత్రమే సాధ్యమైంది. జక్కన్న సినిమాలలో విజువల్ ఎఫెక్ట్స్ కూడా ప్రేక్షకులను మెప్పించేలా ఉంటాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆదిపురుష్ సినిమాను చూసిన ప్రేక్షకులలో కొంతమంది విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు.
ఇదే సినిమాను రాజమౌళి తెరకెక్కించి ఉంటే ఈ సినిమా రేంజ్ వేరే లెవెల్ లో ఉండేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆదిపురుష్ సినిమాను చూసిన నెటిజన్లు రాజమౌళిని చూసి ఇతర దర్శకులు చాలా విషయాలను నేర్చుకోవాలని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే అన్ని విషయాలలో ప్రశంసలు అందుకునే రాజమౌళి ఒక్క విషయంలో మాత్రం విమర్శలు ఎదుర్కొంటున్నారు. జక్కన్న వేగంగా సినిమాలు తీయడం లేదని ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రాజమౌళి తర్వాత సినిమా మహేష్ బాబు హీరోగా తెరకెక్కాల్సి ఉంది.
అయితే మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీ షూట్ పూర్తైన తర్వాత మాత్రమే మహేష్ జక్కన్న కాంబో మూవీ తెరకెక్కనుంది. మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీ ఆలస్యం కావడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మహేష్ బాబుకు రాజమౌళి కెరీర్ బెస్ట్ హిట్ ఇవ్వాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. పాన్ వరల్డ్ స్థాయిలో జక్కన్న మహేష్ బాబుకు హిట్ ఇవ్వాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మహేష్ రాజమౌళి కాంబో మూవీ భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడంతో పాటు నిర్మాతలకు మంచి లాభాలను అందించాలని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.
మహేష్ రాజమౌళి (Rajamouli) మూవీ కథకు సంబంధించి వేర్వేరు వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. మహేష్ జక్కన్న కాంబో మూవీ బడ్జెట్ 1000 కోట్ల రూపాయలు అని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా అటు మహేష్ ఫ్యాన్స్ ఇటు జక్కన్న ఫ్యాన్స్ మెచ్చేలా ఉంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.