రామ్ చరణ్, ఎన్టీఆర్ లాంటి ఇద్దరు స్టార్ హీరోలతో రాజమౌళి సినిమా తీస్తున్నానని అనౌన్స్ చేసినప్పుడు అందరిలో ఓ ప్రశ్న మెదిలింది. సినిమాలో ఇద్దరు హీరోలకు సమ ప్రాధాన్యత ఉంటుందా..? అనే అనుమానాలు వ్యక్తం చేశారు. ఇద్దరిలో ఎవరిని తక్కువ చేసినా.. ఫ్యాన్స్ హర్ట్ అవుతారు. తాజాగా ఈ విషయంపై రాజమౌళి ఓపెన్ అయ్యారు.
ఈ అంశంపై ఇద్దరు హీరోల అభిమానులతో చర్చించిన విషయం గురించి బయటపెట్టారు రాజమౌళి. అభిమానుల పర్మిషన్ కూడా తీసుకున్న తరువాత ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేశామని చెబుతున్నాడు. ముందుగా చరణ్ ఫ్యాన్స్ తో మాట్లాడానని చెప్పారు. వారు ‘మా హీరోనే బెస్ట్.. తారక్ కూడా మంచి నటుడు.. కానీ మా హీరోనే బెస్ట్ అన్నారు’ అంటూ చెప్పుకొచ్చారు.
ఆ తరువాత ఎన్టీఆర్ అభిమానులతో మాట్లాడననని.. వాళ్లు కూడా రామ్ చరణ్ మంచి నటుడే కానీ తారక్ బెస్ట్ అన్నారని.. ఈ ఇద్దరి హీరోల అభిమానుల మధ్య ఎలాంటి భిన్నాభిప్రాయాలు లేవని తెలుసుకున్నానని.. తరువాతే సినిమా అనౌన్స్ చేశామని చెప్పుకొచ్చారు రాజమౌళి. ఎన్టీఆర్, రామ్ చరణ్ తమ నిజజీవితంలో ఎలా ఉంటారో వాళ్లను, వాళ్ల అభిమానులు కూడా అలానే ఫాలో అవుతున్నారని అన్నారు రాజమౌళి.
ఇద్దరి హీరోల ఫ్యాన్స్ మధ్య ఎలాంటి ఇబ్బందులు లేవనే విషయాన్ని తెలుసుకున్నానని చెప్పారు రాజమౌళి. ‘ఆర్ఆర్ఆర్’ కంటే ముందే తారక్-చరణ్ ఫ్రెండ్స్ అవ్వడం తనకు కలిసొచ్చింది.. అదే స్నేహాన్ని తెరపై కూడా చూపించానని చెప్పుకొచ్చారు రాజమౌళి. మొత్తానికి అభిమానుల నుంచి కూడా ఫీడ్ బ్యాక్ తీసుకొనే ‘ఆర్ఆర్ఆర్’ మొదలుపెట్టిన విషయాన్ని బయటపెట్టారు రాజమౌళి.