టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్ (Satyadev) హీరోగా తెరకెక్కిన ‘కృష్ణమ్మ’ (Krishnamma) సినిమా మే 10న రిలీజ్ కాబోతోంది. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ సమర్పణలో రూపొందిన ఈ చిత్రాన్ని ‘అరుణాచల క్రియేషన్స్’ బ్యానర్ పై కృష్ణ కొమ్మలపాటి నిర్మించారు. వి.వి.గోపాలకృష్ణ ఈ చిత్రానికి దర్శకుడు. వాస్తవానికి మే 3 నే ఈ సినిమా రిలీజ్ కావాలి. కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా పడి మే 10న రిలీజ్ కాబోతోంది. ఇక ప్రమోషన్లలో భాగంగా నిన్న ట్రైలర్ లాంచ్ తో పాటు ప్రీ రిలీజ్ వేడుకని కూడా నిర్వహించారు మేకర్స్.
ఈ వేడుకకి కొరటాల శివ (Koratala Siva) , రాజమౌళి (SS Rajamouli), అనిల్ రావిపూడి (Anil Ravipudi) , గోపీచంద్ మలినేని (Gopichand Malineni) వంటి స్టార్ డైరెక్టర్లు హాజరయ్యారు. ఈ వేడుకలో భాగంగా యాంకర్ శ్యామల (Shyamala) వీరిని ఫన్నీ క్వశ్చన్స్ అడిగి ఆటపట్టించింది. ఈ క్రమంలో ‘వీడు ఉన్నాడు కాబట్టి నేను ఈ పెద్ద ప్రాబ్లమ్ నుండి బయటపడి ఈరోజు ఇలా ఉన్నాము? అని మీకు అనిపిస్తుంది’ అంటూ ఆ స్టార్ డైరెక్టర్స్ ని ప్రశ్నించింది శ్యామల. ఇందుకు అనిల్ రావిపూడి.. ‘కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) ‘పటాస్’ (Pataas) ఛాన్స్ ఇవ్వడం వల్ల ఈరోజు నేను ఇలా ఉన్నాను..
నాకు సేవియర్ అతనే’ అంటూ సమాధానం ఇచ్చాడు. ఆ తర్వాత గోపీచంద్ మలినేని ‘రవితేజ (Ravi Teja) ఛాన్స్ ఇవ్వడం వల్ల నేను ఇలా ఉన్నాను’ అంటూ సమాధానం ఇచ్చాడు. అక్కడి వరకు బాగానే ఉంది. కానీ కొరటాల శివ విషయానికి వస్తే.. ‘నేను బయటపడేంత సిట్యువేషన్ రాలేదు. అంతా సాఫీగా జరిగిపోయింది’ అంటూ సమాధానం ఇచ్చాడు. వాస్తవానికి కొరటాలకి ఫస్ట్ ఛాన్స్ ఇచ్చింది ప్రభాస్ (Prabhas) . ఎందుకో అతని పేరు చెప్పడానికి అతను ఇష్టపడలేదు.
పైగా ‘మిర్చి’ (Mirchi) నిర్మాతలతో కొరటాలకి కమ్యూనికేషన్ గ్యాప్ ఉందనే ప్రచారం కూడా ఉంది. అతని లేటెస్ట్ కామెంట్స్ తో అది నిజమే అనే అభిప్రాయాలూ వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. రాజమౌళి తనకు ఫస్ట్ ఛాన్స్ ఇచ్చిన ఎన్టీఆర్ (Jr NTR) పేరు పక్కన పెట్టేసి ‘స్టూడెంట్ నెంబర్ 1 (Student No: 1) సినిమాకి రైటర్ పృథ్వీ తేజ హెల్ప్ చేశాడు’ అంటూ సమాధానం ఇచ్చాడు. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి కూడా ఝలక్ ఇచ్చినట్టు అయ్యింది.