Rajamouli New Car: రాజమౌళి కొత్త కారు విలువ అన్ని లక్షలా?

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరైన రాజమౌళి ఆర్ఆర్ఆర్ మూవీతో మరో బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకున్నారు. ఆర్ఆర్ఆర్ ఫుల్ రన్ లో బాహుబలి2 కలెక్షన్ల రికార్డులను బ్రేక్ చేసే ఛాన్స్ లేకపోయినా ఈ సినిమాకు 1100 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. అయితే తాజాగా రాజమౌళి కొత్త కారును కొనుగోలు చేశారు. వోల్వో ఎక్స్‌సి40 కారును జక్కన్న కొనుగోలు చేయగా ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Click Here To Watch NOW

ఈ కారు ఖరీదు 44 లక్షల 50 వేల రూపాయలు అని సమాచారం. ఈ కారు ఫ్యూజన్ రెడ్ కలర్ లో ఉండగా కారు చాలా బాగుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ కారులో ఎన్నో అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయని సమాచారం. ఈ కారులో డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ తో పాటు పనోరమిక్ సన్‌రూఫ్, వైర్ లెస్ ఛార్జింగ్, ఇతర ఫీచర్లు ఉన్నాయని తెలుస్తోంది. వోల్వో కార్స్ ఇండియా ప్రతినిధి రాజమౌళికి తాళాలను అందించారు.

వోల్వో కార్స్ ఇండియా ఇన్ స్టాగ్రామ్ లో ఫోటోలను షేర్ చేయడంతో ఈ ఫోటోలు చక్కర్లు కొడుతున్నాయి. రాజమౌళి కొత్త కారును కొనుగోలు చేయడంతో నెటిజన్లు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మరోవైపు ఆర్ఆర్ఆర్ మూవీ భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడంతో కొంతకాలం విశ్రాంతి తీసుకుంటున్న రాజమౌళి ఆ తర్వాత మహేష్ బాబు సినిమాపై దృష్టి పెట్టనున్నారు.

ఈ సినిమా మల్టీస్టారర్ అని వార్తలు ప్రచారంలోకి రాగా ఆ వార్తలను రాజమౌళి ఇప్పటికే ఖండించారు. రాజమౌళి ఒక్కో సినిమాకు కళ్లు చెదిరే రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. చాలామంది టాలీవుడ్ స్టార్స్ రెమ్యునరేషన్ తో పోల్చి చూస్తే రాజమౌళి రెమ్యునరేషన్ ఎక్కువ మొత్తం కావడం గమనార్హం. సినిమాల ద్వారా సంపాదించిన మొత్తాన్ని రాజమౌళి తెలివిగా ఇన్వెస్ట్ చేస్తున్నారని బోగట్టా.

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus