స్టార్ డైరెక్టర్ రాజమౌళి స్టూడెంట్ నంబర్ 1 నుంచి ఆర్ఆర్ఆర్ వరకు ఒక్కో సినిమాకు ఒక్కో తరహా కథను ఎంచుకుంటున్న సంగతి తెలిసిందే. రాజమౌళి ప్రతి సినిమాను బ్లాక్ బస్టర్ హిట్ చేయడానికి పడే కష్టం అంతాఇంతా కాదు. స్టూడెంట్ నంబర్ 1 మినహా మిగిలిన రాజమౌళి సినిమాలకు రాజమౌళి తండ్రి, ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ కథ అందించారు. అయితే కథ నచ్చినా ఒక సినిమాకు దర్శకత్వం వహించే అవకాశాన్ని రాజమౌళి మిస్సయ్యారు.
రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ విషయాలను వెల్లడించారు. సల్మాన్ ఖాన్ కు కథ చెప్పిన తర్వాత రాజమౌళికి కథ చెప్పగా రాజమౌళికి కథ బాగా నచ్చిందని విజయేంద్ర ప్రసాద్ అన్నారు. ఎండలో బాహుబలి యుద్ధ సన్నివేశాలు తెరకెక్కిస్తున్న సమయంలో రాజమౌళిని ఆ సినిమా డైరెక్ట్ చేస్తావా అని అడగగారాజమౌళి నో చెప్పారని విజయేంద్ర ప్రసాద్ తెలిపారు. ఆ తర్వాత కబీర్ ఖాన్ భజరంగీ భాయిజాన్ సినిమాను తెరకెక్కించారని బ్యాడ్ మూడ్ లో ఉండటం
వల్లే భజరంగీ భాయిజాన్ సినిమా డైరెక్షన్ చేయడానికి నో చెప్పినట్టు రాజమౌళి తనకు చెప్పాడని భజరంగీ భాయిజాన్ చేయనందుకు రాజమౌళి చాలా ఫీలయ్యాడని విజయేంద్ర ప్రసాద్ అన్నారు. ప్రస్తుతం రాజమౌళి స్థాయిని అందుకోవడానికి తాను కష్టపడుతున్నానని విజయేంద్ర ప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజమౌళి మూడ్ బాగోలేని సమయంలో కథ చెప్పి డైరెక్ట్ చేస్తావా అని అడగడం తన తప్పైందని విజయేంద్ర ప్రసాద్ చెపుకొచ్చారు.