‘ఆర్‌ఆర్‌ఆర్’ గురించి ‘సర్కారు వారి పాట’ సినిమా సంక్రాంతి బరి నుండి తప్పుకున్నప్పుడు ‘మై హీరో’ అంటూ మహేష్ బాబు పేరును ట్వీట్‌లో ప్రస్తావించారు ఎస్.ఎస్.రాజమౌళి. ఆ తర్వాత వివిధ సందర్భాల్లో సినిమా గురించి రాజమౌళి, మహేష్‌బాబు, విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుకోవడం తప్పితే.. సినిమా గురించి ఎక్కడా అధికారిక అనౌన్స్‌మెంట్ అయితే లేదు. కానీ గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఈ సినిమా గురించే మరో చర్చ జరుగుతోంది. అదే ‘మే 31న ఏమైనా ఉందా?’ అని.
మే 31 ప్రత్యేకత ఏంటో మహేష్‌బాబు ఫ్యాన్స్‌కి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అదే సూపర్‌స్టార్ కృష్ణ జన్మదినం. ఏటా ఆ రోజున మహేష్ సినిమా గురించి ప్రత్యేక అప్‌డేట్ వస్తూ ఉంటుంది. తన సినిమాల అనౌన్స్‌మెంట్లు, లుక్‌లు, వీడియోలు ఇలా ఏవో ఒకటి రిలీజ్ చేస్తుంటారు. ఇప్పుడు మే 31న ఏం రిలీజ్ చేస్తారు అనేదే ప్రశ్న. మహేష్ సినిమాలేవీ సెట్స్ మీద లేవు. త్రివిక్రమ్ సినిమా అనౌన్స్‌మెంట్ అయిపోయింది, షూటింగ్ ఇంకేం మొదలవ్వలేదు.
కాబట్టి ఎలాంటి లుక్‌లు రావు. కానీ సినిమా రెగ్యులర్ షూట్ ఎప్పటి నుండి అనేది తెలియొచ్చు. ఇందులో ఫ్యాన్స్‌కి కిక్ ఉంటుంది కానీ. రాజమౌళి సినిమా అనౌన్స్‌మెంట్ వస్తే చొక్కాలు చింపుకునేంత ఆనందం అయితే వేస్తుంది. అందుకే మహేష్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. కె.ఎల్.నారాయణ నిర్మాణంలో ఈ సినిమా ఉంటుందని అప్పుడెప్పుడో చెప్పినట్లు గుర్తు. ఇప్పుడు మరి ఆయన నిర్మాణ సంస్థ దుర్గా ఆర్ట్స్ నుండి ఎలాంటి ప్రకటన వస్తుందో చూడాలి.
అయితే రాజమౌళి సినిమాకు సంబంధించి కథ ఫైనల్ అవ్వలేదు. త్వరలో కూర్చుని కథ ఫైనల్ చేస్తామని ఆ మధ్య రాజమౌళి చెప్పినట్లు గుర్తు. దీంతో మే 31న ఈ సినిమా గురించి ఏమైనా అప్‌డేట్ వస్తుందా? అని ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. కనీసం సినిమా ఉందంటూ పోస్టర్ మీద #SSMBSSR అంటూ ఓ ట్యాగ్ కనిపించినా చాలు అని అనుకుంటున్నారు. మరి రాజమౌళి అండ్ కో ఏం ఆలోచిస్తున్నారో చూడాలి.
Most Recommended Video
‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!