ఆర్ఆర్ఆర్ మూవీ మరోసారి వార్తల్లో నిలిచింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఐమాక్స్ థియేటర్‌లో ఈ మూవీ స్క్రీనింగ్ అయ్యింది. చైనీస్ థియేటర్ (TLC Chinese IMAX Theater)లో ఆర్ఆర్ఆర్ ఒరిజినల్ వెర్షన్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్‌తో ప్రత్యేకంగా ప్రదర్శితం అయ్యింది.సెప్టెంబర్ 30న సాయంత్రం 7 గంటలకు స్క్రీనింగ్ స్టార్ట్ అయ్యింది. ఈ స్పెషల్ షోకు డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి కూడా హాజరయ్యారు. దీంతోపాటు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ సెషన్‌లో కూడా పాల్గొన్నాడు అని సమాచారం.
ఇదిలా ఉండగా.. షో జరుగుతున్న టైంలో నాటు నాటు పాటకు సినిమా చూస్తున్న ఆడియన్స్ తో కలిసి డాన్స్ చేశాడు రాజమౌళి. ఇది కాస్త హాట్ టాపిక్ అయ్యింది. నాటు నాటు పాటకు అక్కడి థియేటర్లో ప్రేక్షకులు ఎంజాయ్ చేయడం అంటే మామూలు విషయం కాదు. అందులోనూ ఈ చిత్రంలో కొమరం భీమ్ గా కనిపించిన ఎన్టీఆర్ కు కూడా చైనా లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఓ తెలుగు దర్శకుడి సినిమాకి ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ దక్కడం కంటే పెద్ద ఆస్కార్ ఏముంటుంది.
త్వరలోనే రాజమౌళి తెరకెక్కించిన ఈగ, మర్యాద రామన్న చిత్రాలు కూడా ఈ చైనీస్ ధియేటర్ లో స్క్రీనింగ్ కానున్నాయి అని వినికిడి. ఇక ఎన్టీఆర్, రాంచరణ్ … నటించిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.1200 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. ఈ ఏడాది టాలీవుడ్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.