Rajamouli: రాజమౌళి అలా చేస్తే హీరోలకు ఫ్లాప్ రాదా?

రాజమౌళి డైరెక్షన్ లో నటిస్తే ఏ హీరోకు అయినా కెరీర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ దక్కుతుంది. జక్కన్న డైరెక్షన్ లో నటించడం ద్వారా హీరోల పేర్లు దేశవ్యాప్తంగా మారుమ్రోగడంతో పాటు హీరోలకు ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకంతకూ పెరిగే అవకాశం ఉంది. అయితే రాజమౌళి డైరెక్షన్ లో నటించిన హీరో తర్వాత సినిమా మాత్రం ఖచ్చితంగా ఫ్లాప్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ఆచార్య సినిమాతో ఈ సెంటిమెంట్ నిజమని మరోసారి ప్రూవ్ అయింది.

ఆర్ఆర్ఆర్ మూవీలో ఎన్టీఆర్ మరో హీరో కాగా ఎన్టీఆర్ ఫ్యాన్స్, రాజమౌళి తర్వాత సినిమాలో మహేష్ బాబు హీరోగా కాగా మహేష్ బాబు ఫ్యాన్స్ ఈ సెంటిమెంట్ విషయంలో తెగ టెన్షన్ పడుతున్నారు. అయితే జక్కన్న సెంటిమెంట్ ను జక్కన్నే బ్రేక్ చేయగలరని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. జక్కన్న ప్రభాస్ తో వరుసగా బాహుబలి1, బాహుబలి2 సినిమాలను తెరకెక్కించారు.

అయితే ఈ రెండు సినిమాలు ఒక సినిమాను మించి మరొకటి హిట్ అయ్యాయి. రాజమౌళి తన డైరెక్షన్ లో నటించిన హీరో తర్వాత సినిమా స్క్రిప్ట్ విషయంలో జోక్యం చేసుకుంటే ఆయా హీరోలకు ఫ్లాప్ వచ్చే అవకాశాలు ఉండవు. ఈ విధంగా చేయడం ద్వారా జక్కన్న సెంటిమెంట్ కూడా బ్రేక్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. మరి జక్కన్న ఈ దిశగా అడుగులు వేస్తారో లేదో చూడాల్సి ఉంది.

ఫ్లాప్ సెంటిమెంట్ వల్ల స్టార్ హీరోలు సైతం జక్కన్న డైరెక్షన్ లో నటించాలంటే ఒకింత టెన్షన్ పడుతున్నారు. సినిమా ప్రమోషన్స్ లో, ఇంటర్వ్యూలలో సైతం జక్కన్నకు ఈ సెంటిమెంట్ కు సంబంధించి ప్రశ్నలు ఎదురవుతుండటం గమనార్హం. జక్కన్న ఈ ప్రశ్నలకు ఇబ్బంది పడుతూనే సమాధానం ఇస్తున్నారు. జక్కన్న ప్రస్తుతం వెకేషన్ లో ఉన్నారు. జూన్ నెల నుంచి రాజమౌళి మహేష్ కాంబో సినిమా షూటింగ్ మొదలుకానుంది.

ఆచార్య సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

కన్మణి రాంబో కటీజా సినిమా రివ్యూ & రేటింగ్!
వీళ్ళు సరిగ్గా శ్రద్ద పెడితే… బాలీవుడ్ స్టార్లకు వణుకు పుట్టడం ఖాయం..!
కే.జి.ఎఫ్ హీరో యష్ గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus