బాహుబలి….అవును ఇప్పుడు ఈ పేరు మరోసారి మార్మోగిపోతుంది…ఎక్కడ విన్నా ఇదే పేరు….ఎక్కడ చూసినే దీనిగురించే చర్చ…చిన్న వాళ్ళ నుంచి పెద్ద వాళ్ళ వరకూ ఇదే టాపిక్ పై డిస్కషన్ చేసేస్తున్నారు…ఇదిలా ఉంటే మరో పక్క…‘బాహుబలి 2’ ట్రైలర్ రిలీజ్ అయి 24 గంటలు ఇంకా పూర్తి అవ్వకుండానే ఈ మూవీ ట్రైలర్ కు వస్తున్న అనూహ్యమైన స్పందనను చూసి రాజమౌళి తన కలక్షన్స్ టార్గెట్ ను మార్చుకుంటున్నట్లు టాలీవుడ్ సర్కిల్స్ లో రకరకాల గుసగుసలు వినిపిస్తున్నాయి….విషయం ఏమిటంటే….జక్కన్న బాహుబలి 1 ఎంతటి ఘన విజయం సాధించిందో మన అందరికీ తెలిసిందే…అయితే అంతకు మించిన రేంజ్ లో బాహుబలి 2ని నిలపాలని సర్వ సన్నాహాలు చేస్తున్నాడు…రాజమౌళి…అయితే అందులో భాగంగానే…మొదట్లో ‘బాహుబలి 2’ 1000 కోట్ల కలక్షన్స్ టార్గెట్ అని నిర్ణయించుకుని…దానికి అనుగుణంగా ప్ల్యాన్స్ వేసుకున్నాడు…..కానీ ట్రైలర్ కి వస్తున్న అనూహ్య స్పందన చూసి…. రాజమౌళి ఇప్పుడు తన టార్గెట్ ను 1500 వందల కోట్ల దిశగా ఫిక్స్ చేసుకుంటే ఎలా ఉంటుంది అన్న ఆలోచనలో ఉన్నాడని టాక్.
వాస్తవానికి 1500 కోట్ల ఫిగర్ అన్నది అసాధ్యం అయినప్పటికీ అంత భారీ టార్గెట్ ను అనుకుంటే కనీసం 1200 కోట్ల ఫిగర్ కు అయినా వస్తుంది కదా అన్న ఆలోచనలలో రాజమౌళి ఉన్నాడని తెలుస్తోంది. అయితే అంతటి ఘన విజయాన్ని సాధించాలంటే…ఇప్పుడున్న వ్యూహాలు…ఎత్తుగడలు….సరిపోవని…సరికొత్త వ్యూహాలు రచించాలని జక్కన్నా భావిస్తున్నట్లు తెలుస్తుంది…అయితే మన ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ను శాసిస్తున్న బాలీవుడ్ హీరోల్లో ….టాప్ రికార్డ్ అమీర్ ఖాన్ మూవీ ‘పికె’ పై ఉంది. ఈమూవీకి 792 కోట్ల కలక్షన్స్ వచ్చాయి. అంటే టాప్ సినిమాకి అంతటి భారీ హిట్ అయిన సినిమాకే 800కోట్లు దగ్గరగా వస్తే… బాహుబలి 1500 కోల్టూ రాబట్టాలి అంటే ఎంతటి ఘన విజయాన్ని నమోదు చెయ్యాలో….చూద్దాం మరి ఏం జరుగుతుందో….
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.