రాజమౌళి సినిమాలో ట్విస్ట్‌లు, మ్యాజిక్‌లు, ప్లాట్స్ అర్థం చేసుకోవడం ఎంత కష్టమో, ఆయన ప్రమోషనల్ స్ట్రాటజీలను అర్థం చేసుకోవడం అంత కష్టం. బిగ్‌బాస్ షోలో పార్టిసిపెంట్లు కూడా అన్ని స్ట్రాటజీలు వాడరు అంటుంటారు. తాజాగా ఆయన ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమా విషయంలోనూ ఇలాంటి స్ట్రాటజీలనే అప్లై చేస్తున్నారు. ఇప్పటివరకు విడుదల చేసిన టీజర్లు, వీడియోలు, గ్లింప్స్‌ల్లో ఎక్కడా డైలాగ్ లేకుండా చూసుకున్న జక్కన్న బయట ఓ కార్యక్రమంలో చెప్పేశారు. ‘యుద్ధాన్ని వెతుక్కుంటూ ఆయుధాలు వాటంతట అవే వస్తాయి.
అది ధర్మయుద్ధమైతే విజయం తథ్యం’- రాజమౌళి చెప్పిన ‘ఆర్‌ఆర్‌ఆర్’లో డైలాగ్ ఇది. ఇదేంటి ఇలా జక్కన్న డైలాగ్‌లు చెప్పేస్తాడా? ఎప్పుడూ మనం ఇలాంటివి చూడలేదే! అనిపిస్తోందా? అదే కదా విషయం. టీజర్లలో ఎక్కడా ఒక్క పదం కూడా లేకుండా చూసుకున్న జక్కన్న ఇలా డైలాగ్ ఎందుకు రివీల్ చేసినట్లు అనేదే ఇక్కడ పాయింట్. అయితే రాజమౌళి ఈ డైలాగ్‌ను ఏ స్టేజీ మీద చెప్పలేదట. ఓ ప్రముఖ టీవీ మీడియా హౌస్‌తో మాట్లాడుతూ చెప్పుకొచ్చాడట.
ఆ తర్వాత డైలాగ్ వైరల్‌గా మారింది. ఏ మాటకామాట డైలాగ్ అయితే అదిరిపోయింది. తెరపై ఏ హీరో చెబుతాడో కానీ… థియేటర్‌లో చప్పట్లు, విజిల్స్ పక్కా. కానీ జక్కన్న ఎందుకు డైలాగ్ రివీల్ చేశాడబ్బా. దీని వెనుక ఏదో ప్రమోషనల్ స్ట్రాటజీ ఉండే ఉంటుంది మరి.