తన బలాన్ని బయటపెట్టిన రాజమౌళి…!

దర్శకధీరుడు రాజమౌళి… ఈ పేరు ప్రపంచమంతా పాపులర్ అయ్యింది. అందుకు ప్రధాన కారణం బాహుబలి. తెలుగు సినిమా స్థాయిని పెంచింది ఆ చిత్రం. తెలుగు సినిమా మార్కెట్ ను పెంచింది.. ఇప్పుడు మరిన్ని పాన్ ఇండియా సినిమాలు రావడానికి కారణమయ్యింది. ప్రస్తుతం రాజమౌళి ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం చేస్తున్నాడు. ఎన్టీఆర్, చరణ్ వంటి ఇద్దరు బడా స్టార్ లు నటిస్తున్న చిత్రం కావడంతో .. అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఇప్పటి వరకూ రాజమౌళి 11 సినిమాలు చేసాడు. అవన్నీ హిట్లే. ఇప్పుడు ‘ఆర్.ఆర్.ఆర్’ అదే ‘రౌద్రం రణం రుషితం’ 12 వ చిత్రం. అయితే ఒక్క ప్లాప్ లేకుండా రాజమౌళి ఎలా జాగ్రత్త పడుతున్నాడు.

అసలు అన్నేసి సంవత్సరాలు సెట్స్ లో ఉంటూ సినిమాలు తీస్తున్న మన జక్కన్న కోపం రాకుండా అంత కూల్ ఎలా మైంటైన్ చేస్తాడు… అని చాలా మంది ఇండస్ట్రీ లో డిస్కస్ చేసుకుంటారు.అందుకు రాజమౌళి నా బలం వెనుక ఉన్నది అతనే అంటున్నాడు. రాజమౌళి బలానికి ప్రధాన కారణం స్టార్ సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ అని చెబుతున్నాడు. రాజమౌళి మాట్లాడుతూ…”చాలాసార్లు నేను పేషన్స్ కోల్పోయేవాడిని. నేను చెప్పిన చిన్న చిన్న టిప్స్ కూడా యూనిట్ సభ్యులు పాటించకపోతే.. నేను టెంపర్ కోల్పోయేవాడిని. నాకు చాలా కోపం వచ్చేసేది. ఈ విషయం గురించి నా సినిమాటోగ్రాఫర్ సెంథిల్ నాతో మాట్లాడాడు. డైరక్ట్ గా ఆ విషయం గురించి చెప్పలేదు కానీ… ఇన్డైరెక్ట్ గా నాకు అసలు మ్యాటర్ చెప్పేశాడు.

యూనిట్ సభ్యులు అంతా కంట్రోల్ లో ఉండాలంటే మనం కూడా టెంపర్ కోల్పోకూడదని చెప్పాడు. అప్పుడు నేను ఆలోచిస్తే కరెక్టే కదా అనిపించింది. పదేళ్ల క్రితం సెంథిల్ చెప్పిన ఆ మాట… నేను ఇప్పటికీ ఫాలో అవుతున్నాను. ఎలాంటి సిట్యుయేషన్ అయినా… ఎంత కఠినమైన సందర్భమయినా.. సహనం-ఓర్పు కోల్పోను… అదే నా బలం. మిగిలిన డైరెక్టర్స్ కంటే నేను వేరు ఏమీ కాదు.. ఒక్కొక్కరికి ఒక్కో స్టైల్ ఉంటుంది. నా మేకింగ్ లో స్పెషాలిటీ అంటూ ఏమి ఉండడు. కాకపోతే కథ, సోల్ పాయింట్, మేకింగ్ లో ఉన్న బేసిక్స్ దృష్టిలో పెట్టుకుని సినిమా తీస్తాను అంతే.నా మైండ్ లో ఉన్న విజువల్ అలాగే రియాలిటీకి వచ్చే వరకూ కష్టపడుతూనే ఉంటాను” అంటూ చెప్పుకొచ్చాడు.

Most Recommended Video

అమృతారామమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బాహుబలి’ ని ముందుగా ప్రభాస్ కోసం అనుకోలేదట…!
తండ్రికి తగ్గ తనయలు అనిపిస్తున్న డైరెక్టర్స్ కూతుళ్లు

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus