యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ సినిమాలో చరణ్ తో కలిసి నటిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ కు జోడీగా ఈ సినిమాలో ఒలీవియా మోరిస్ నటిస్తున్నారు. ఆగష్టు నెల చివరి వారం నాటికి ఆర్ఆర్ఆర్ షూటింగ్ ను పూర్తి చేయాలని భావిస్తున్న రాజమౌళి ఈ మూవీ షూటింగ్ కొరకు విదేశాలకు వెళ్లనున్నారని సమాచారం. విదేశాల్లో ఎన్టీఆర్, ఒలీవియా మధ్య పాటను జక్కన్న చిత్రీకరించనున్నారని తెలుస్తోంది.
ఆర్ఆర్ఆర్ సినిమా కోసం దేశం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ కు చెందిన ఇద్దరు స్టార్ హీరోలు ఒకే సినిమాలో నటిస్తుండటంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. రాజమౌళి ఉక్రెయిన్ లో ఎన్టీఆర్, ఒలీవియా కాంబో పాటను షూట్ చేయనున్నారని ఆన్ లైన్ లో రాజమౌళి లొకేషన్స్ ను సెర్చ్ చేశారని సమాచారం. ఆగష్టు మొదటి వారంలో చిత్రయూనిట్ అక్కడికి వెళుతుందని తెలుస్తోంది. ఆర్ఆర్ఆర్ మూవీ కోసం దేశం మొత్తం ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే.
ఎన్టీఆర్, ఒలీవియా మధ్య చిత్రీకరించే పాట సినిమాకే హైలెట్ అయ్యేలా ఉంటుందని తెలుస్తోంది. మరో పాటలో చరణ్, ఎన్టీఆర్, అలియా ముగ్గురూ కనిపిస్తారని సమాచారం. ఈ రెండు పాటలు పూర్తైతే ఆర్ఆర్ఆర్ మూవీ ప్రకటించిన తేదీకే రిలీజ్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. దాదాపు 450 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం.
Most Recommended Video
విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!