ఆర్ ఆర్ ఆర్ లేటైనా పర్లేదు బెటర్ అవుట్ ఫుట్ తోనే వస్తాను అంటున్నాడు రాజమౌళి. అందుకే ఆయన అరాకొరా సౌకర్యాలు, సిబ్బందితో మూవీ తెరకెక్కించడానికి ఇష్టపడడం లేదని తెలుస్తుంది. దీనితో ఆర్ ఆర్ ఆర్ పై అంచనాలు మరింత పెరిగిపోతున్నాయి. ఇక రాజమౌళి విజువల్ వండర్ గా ఆర్ ఆర్ ఆర్ ని తీర్చిదిద్దడంతో పాటు ఎన్టీఆర్, మరియు చరణ్ పాత్రలను అద్భుతంగా తెరపై ఆవిష్కరించనున్నాడని సమాచారం. ఐతే కొమరం భీమ్ గా నటిస్తున్న ఎన్టీఆర్ పాత్రపై రాజమౌళి మరింత కేర్ పెట్టాడట.
ముఖ్యంగా ఎన్టీఆర్ డైలాగ్స్ వీరోచితంగా, ఒళ్లుగగ్గుర్ గొలిపేలా ఉంటాయట. కొమరం భీమ్ గా తెలంగాణా యాసలో ఎన్టీఆర్ పలికే డైలాగ్స్ సినిమాలో మరో ఆకర్షణగా ఉంటాయట. డైలాగ్ డిక్షన్ మరియు డెలివరీలో తనకు తిరుగు లేదని నిరూపించుకున్న ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ లో చెప్పే పేట్రియాటిక్ డైలాగ్స్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచడం ఖాయం అని తెలుస్తుంది. ఇక ఎన్టీఆర్ ఫ్యాన్స్ రాజమౌళ ఫస్ట్ లుక్ వీడియో ఎప్పుడు విడుదల చేస్తాడా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
షూటింగ్ ముందుకు కదిలితే ఫ్యాన్స్ కి ఆ ట్రీట్ సిద్ధం చేద్దాం అని రాజమౌళి ప్రణాళిక వేస్తున్నప్పటికీ పరిస్థితులు సహకరించడం లేదు. అల్లూరి సీతారామ రాజుగా చేస్తున్న చరణ్ ఫస్ట్ లుక్ వీడియోకి విపరీతమైన ఆదరణ దక్కడంతో, ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ వీడియోపై అంచనాలు మరో స్థాయికి చేరాయి. వివిధ పరిశ్రమలకు చెందిన నటులను, సిబ్బందిని కరోనా సమయంలో ఒక చోటికి చేర్చడం రాజమౌళికి ఇబ్బంది అవుతుంది.