కెరీర్ తొలినాళ్లలో మాస్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి మగధీర సినిమాతో తన ఇమేజ్ ను పూర్తిగా మార్చుకున్న సంగతి తెలిసిందే. మగధీర సక్సెస్ తో రాజమౌళి పాన్ ఇండియా సినిమాలను తెరకెక్కించగల సత్తా ఉన్న డైరెక్టర్ అని ప్రూవ్ చేసుకున్నారు. కేవలం 40 కోట్ల రూపాయల బడ్జెట్ తో మగధీర సినిమాను రాజమౌళి తెరకెక్కించడం గమనార్హం. మగధీర సినిమాలో అనగనగనగా పాటలో ఆ సినిమాకు పని చేసిన వారంతా కనిపించిన సంగతి తెలిసిందే. ఆ పాట ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.
అయితే రాజమౌళి ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలో కూడా అలాంటి పాటను చూపించబోతున్నారని సమాచారం. ఆగష్టులో ఆర్‌ఆర్‌ఆర్ షూటింగ్ పూర్తి కానుండగా ఉక్రెయిన్ లోని ఒక ప్యాలెస్ లో ఈ ప్రమోషనల్ సాంగ్ ను షూట్ చేయనున్నారని తెలుస్తోంది. సినిమాలోని ప్రధాన తారాగణం ఈ పాటలో కనిపిస్తారని తెలుస్తోంది. అక్టోబర్ నెల 13వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుందని సమాచారం. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్, కొమురం భీమ్ పాత్రలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేస్తున్న సంగతి తెలిసిందే.
రాజమౌళి బాహుబలి సిరీస్ తర్వాత తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ప్రేక్షకుల అంచనాలను మించి ఈ సినిమా ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుండటం గమనార్హం. అలియా భట్, ఒలీవియా మోరిస్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ డేట్ మారే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. మగధీర సెంటిమెంట్ ను రాజమౌళి ఆర్‌ఆర్‌ఆర్ విషయంలో రిపీట్ చేస్తుండటం గమనార్హం.