బాహుబలి సినీ ప్రియులకు ఒక మహా గ్రంథం వంటిది. అందులోని ప్రతి పేజీ అభిమానులకు ఆసక్తి కలిగిస్తుంది. బాహుబలి గురించి ఎంత చెప్పినా, చదివినా బోర్ కొట్టదు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన మూడు రహస్యాలను దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి బయటపెట్టారు. మొదటిది.. బాహుబలిలో శివుడు పాత్రకు మొదట నంది అని పేరు పెట్టారంట. అందుకే అతని పేరు వచ్చేలా “ఎవ్వడంటా .. ఎవ్వడంటా నిన్ను ఎత్తుకుంది.. ఏ తల్లికి పుట్టాడో ఈ నంది కానీ నంది.. ఎవ్వరూ కనంది.. ఎక్కడా వినంది.. ” .. అనే పాట రాసుకున్నారు. కంపోజ్ చేయడమే కాదు.. చిత్రీకరణ కూడా పూర్తి చేశారు.
అప్పుడు అందరూ తన పేరు (రాజమౌళి ని అందరూ నంది అని పిలుస్తారు) ని పెట్టుకున్నాడు .. అని విమర్శిస్తారని అలోచించి శివుడిగా మార్చారంట. ఇక రెండోది .. బాహుబలి కంక్లూజన్ తర్వాత మూడో పార్ట్ ఉండదని స్పష్టం చేశారు. యానిమేషన్, బుక్స్, టీవీ సీరియల్స్ రూపంలో మాత్రం మహిస్మతి రాజ్యం, అందులోని అన్ని పాత్రలు కొనసాగుతాయని తెలిపారు. ఇక చివరగా.. బాహుబలి కంక్లూజన్ లో అత్యంత బలవంతులైన శివుడు, భల్లాల దేవ మధ్య ఫైట్ భీకరంగా అంటుందని, సినిమాలో ఆ పోరాటం హైలెట్ గా నిలుస్తుందని చెప్పారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.