రామ కథ ఎన్ని సార్లు విన్నా వినాలనిపించే మధుర కావ్యం. అందుకే వెండితెరపై కూడా రామాయణం ఎవర్ గ్రీన్ సబ్జెక్టు గా ఉంది. అనేక భాషలలో వందల చిత్రాలు రామాయణం పై తెరకెక్కాయి. రాముని పాత్ర ఎవర్ గ్రీన్ దశాబ్దాలుగా వెండితెరపై సక్సెస్ అందుకుంటుంది. కాగా రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాలో అమరేంద్ర బాహుబలి పాత్రకు స్ఫూర్తి రాముడేనట. ఉత్తముడైన రాముడు పాత్ర చుట్టూ హనుమంతుడు, లక్ష్మణుడు, సుగ్రీవుడు వంటి పాత్రలు ఆయన హీరోయిజం ని ఎలివేట్ చేస్తాయట.
రాముడు పాత్రలో హీరోయిజం ఉంటుంది కానీ అప్లైడ్ హీరోయిజం అట. చుట్టూ ఉన్న పాత్రల ద్వారా మెయిన్ లీడ్ యొక్క ఔన్నత్యం, ఆ పాత్ర వెయిట్ పెంచడం అన్న మాట. బాహుబలి సినిమాకు రాజమౌళి ఈ సూత్రాన్ని అప్లై చేశాడట. బాహుబలి సినిమాలో వీరుడైన అమరేంద్ర బాహుబలి అమ్మ కోసం, ఇచ్చిన మాట కోసం రాజ్యాన్ని వదిలేస్తాడు. ఓ సామాన్య జీవితం గడుపుతాడు. బాహుబలి పక్కన ఉండే కట్టప్ప వంటి మాస్ పాత్రల ద్వారా బాహుబలి రోల్ ఎస్టాబ్లిష్ చేశాడట రాజమౌళి.
అందుకే బాహుబలి మరణించినప్పుడు థియేటర్ లో అందరూ కన్నీరు పెట్టుకున్నారు, అన్నారు రాజమౌళి. కనుక రామాయణంలో రాముని పాత్ర స్ఫూర్తితోనే అమరేంద్ర బాహుబలి పాత్రను తీర్చిదిద్దాను అని రాజమౌళి చెప్పడం జరిగింది. పరోక్షంగా రామాయణం బాహుబలి విజయంలో ఓ పాత్ర పోషించింది. ఇప్పటికే బాలీవుడ్ మరియు టాలీవుడ్ లో రామాయణం స్పూర్తితో అనేక సినిమాలు వచ్చాయి. ప్రముఖ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన విలన్ మూవీకి స్ఫూర్తి రామాయణమే.