టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరైన రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనాలను సృష్టించింది. ఇతర సినిమాలతో పోల్చి చూస్తే మగధీర, బాహుబలి సిరీస్ సినిమాలు, ఈగ, ఆర్ఆర్ఆర్ దర్శకునిగా రాజమౌళి క్రేజ్ ను పెంచడంతో పాటు ఫ్యాన్ ఫాలోయింగ్ ను సైతం పెంచాయి. ప్రస్తుతం రాజమౌళి గ్రాఫిక్స్ కు ప్రాధాన్యత ఉన్న సినిమాలను ఎక్కువగా తెరకెక్కిస్తున్నారనే సంగతి తెలిసిందే. అయితే తాజాగా మార్వెల్ తరహా సినిమాలు తీస్తారా అని రాజమౌళికి ప్రశ్న ఎదురు కాగా తాను అలాంటి సినిమాలను తీయలేనని ఆయన వెల్లడించడం గమనార్హం.
ప్రస్తుతం హాలీవుడ్ ప్రముఖులు సైతం రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలను ప్రశంసిస్తున్నారు. అయితే రాజమౌళి తాను భారతీయ ప్రేక్షకుల అభిరుచికి తగిన సినిమాలను మాత్రమే తెరకెక్కిస్తానని వెల్లడించడం గమనార్హం. ఇక్కడి ప్రేక్షకులకు నచ్చే సినిమాలను తెరకెక్కించడమే తనకు ఎక్కువగా ఆనందాన్ని కలిగిస్తుందని రాజమౌళి చెప్పుకొచ్చారు. భారతీయ పురాణాలు, సంస్కృతి గురించి అవగాహనను ఏర్పరుచుకుని తాను భారతీయ ప్రేక్షకులకు నచ్చే సినిమాలను చేస్తూ వచ్చానని ఇలా సినిమాలు తీయడమే నాకు ఎక్కువగా ఆనందాన్ని కలిగిస్తుందని ఆయన కామెంట్లు చేశారు.
అవసరమైతే మన కథలను మార్వెల్ తరహాలో తీస్తానని ఆయన పేర్కొన్నారు. మార్వెల్ సినిమాలు తన ఆలోచనలకు తగవని ఆయన చెప్పుకొచ్చారు. అయితే ప్రేక్షకుడిగా మార్వెల్ సినిమాలను తాను ఆస్వాదిస్తానని ఆయన కామెంట్లు చేశారు. జక్కన్న భవిష్యత్తులో మరిన్ని బ్లాక్ బస్టర్ హిట్లు సాధించాలని ఆయన ఫ్యాన్స్ భావిస్తున్నారు. బాహుబలి2, ఆర్ఆర్ఆర్ సినిమాలను మించిన విజయాలను ఆయన సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.
రాజమౌళి భవిష్యత్తు ప్రాజెక్టులన్నీ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి. రాజమౌళితో ఒక్క సినిమా అయినా నిర్మించాలని ఆశ పడుతున్న నిర్మాతల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. రాజమౌళితో సినిమాలను నిర్మించిన నిర్మాతలకు ఊహించని స్థాయిలో లాభాలు వచ్చాయనే సంగతి తెలిసిందే.
Most Recommended Video
పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!