ఒక చిన్న ఆలోచనతో మొదలయ్యే కథ.. అది స్క్రిప్ట్ రూపంలోకి మారి.. వెండితెరపైకి వచ్చేవరకు దర్శకుడు ఆన్ డ్యూటీలోనే ఉండాలి. పైగా తీసిన సినిమా అందరికీ చేరువయ్యేలా ప్రచారంలో పాల్గొనాలి. అప్పుడే ఆ చిత్రానికి సంబంధిన పనులు పూర్తి అయినట్లు. ఈ విషయంలో రాజమౌళి పక్కాగా ఉంటారు. డైరక్టర్ చేపట్టాల్సిన భాద్యతలను పూర్తిగా నెరవేస్తారు. గత నెల 28 న బాహుబలి కంక్లూజన్ రిలీజ్ అయింది. ఇక అక్కడితో ఆ సినిమా గురించి జక్కన్న పట్టించుకోనవసరం లేదు. అయినా మరింతమందికి సినిమా చేరువయ్యేలా ఈ వారం రోజులు ప్రచారం చేస్తున్నారు. సోషల్ మీడియాలో విమర్శలకు, ప్రశంసలకు బదులు ఇస్తున్నారు. నిన్నటితో బాహుబలి సిరీస్ కి రాజమౌళి పూర్తిగా ఫుల్ స్టాప్ పెట్టారు.
నిన్న ‘బాహుబలి-2’ మూవీ యూనిట్ చివరి ప్రమోషన్ ఈవెంట్ లండన్ లో జరిగింది. లండన్ లో ప్రమోషన్ ముగిసిన తర్వాత దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి ప్రాజెక్టులో బాహుబలి సినిమాకి సంబంధించినంతవరకు తన పని పూర్తయిందని ట్వీట్ చేశారు. బాహుబలి సిరీస్ లను ఆదరించిన ప్రతి ఒక్కరికీ ఆయన ధన్యావాదాలు తెలిపారు. ఈ ట్వీట్ బాహుబలి అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. రెండురోజుల క్రితం బ్రిటీష్ ఫిలిం ఇన్సిస్టిట్యూట్ ను సందర్శించిన సందర్భంగా తండ్రి విజయేంద్రప్రసాద్ తనను మెప్పించే కథ అందిస్తే మూడో భాగం తీస్తానని బాహుబలి-3పై ఆశలు రేకెత్తించిన రాజమౌళి ఇలా చెప్పడంతో బాధపడ్డారు. అయినా జక్కన తదుపరి ప్రాజక్ట్ ఏంటో తెలుసుకోవాలని ఆసక్తిగా ఉన్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.