‘సాహో’ తర్వాత ప్రభాస్ నుండీ రాబోతున్న మూవీ ‘రాధే శ్యామ్’. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ మూవీకి ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకుడు. ‘ఆర్.ఆర్.ఆర్’ లానే ఈ మూవీ కూడా అనేక సార్లు వాయిదా పడుతూ వస్తూ చివరికి మార్చి 11న విడుదల కాబోతుంది. క్రిస్మస్, న్యూ ఇయర్ టైములో చాలా ప్రమోషన్లు నిర్వహించారు ‘రాధే శ్యామ్’ మేకర్స్. ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్ గా ప్రమోషన్లు చేయడానికి రెడీ అవుతున్నారు.
ఇదిలా ఉండగా.. ఈ చిత్రం హిందీ వెర్షన్ కు బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ వాయిస్ ఓవర్ అందించనున్నారు. ఈ నేపథ్యంలో తెలుగు వెర్షన్‌కి ఏ స్టార్ హీరో వాయిస్ ఓవర్ అందిస్తారు అనే డిస్కషన్లు చాలా జరిగాయి. మేకర్స్ పవన్ కళ్యాణ్,మహేష్ బాబు లను సంప్రదించారు. మహేష్ బాబు దాదాపు ఫైనల్ అయినట్టు కూడా ప్రచారం జరిగింది. కానీ ఎందుకో ఇప్పుడు రాజమౌళిని ఫైనల్ చేసారని టాక్ బలంగా వినిపిస్తుంది.
అవును.. ‘రాధే శ్యామ్’ కు నేరేటర్ గా రాజమౌళి వ్యవహరించనున్నారు. ప్రభాస్ – రాజమౌళిల బంధం గురించి అందరికీ తెలిసిందే.ప్రభాస్ ను పాన్ ఇండియా స్టార్ గా చేసిందే రాజమౌళి. ఇప్పుడు ‘రాధే శ్యామ్’ కు తన వంతు సాయం చేయబోతున్నాడు రాజమౌళి.త్వరలోనే బాలీవుడ్ లో నిర్వహించే ‘రాధే శ్యామ్’ ప్రమోషనల్ ఈవెంట్ కు కూడా రాజమౌళి హాజరు కానున్నాడని తెలుస్తుంది. హైదరాబాద్ లో జరిగే ప్రీ రిలీజ్ వేడుకకి కూడా ఆయన రానున్నారు.
‘రాధే శ్యామ్’ కు ఇంత సాయం చేయడంలో రాజమౌళి స్వార్ధం కూడా ఉంది. ఆయన ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం మార్చి 25న విడుదల కాబోతుంది. ‘రాధే శ్యామ్’ తో ఇప్పటి వరకు ఉన్న అడ్డంకులను తొలగించి తన సినిమాకి లైన్ క్లియర్ చేసుకోవాలన్నది ఆయన మరో ఉద్దేశంగా తెలుస్తుంది.