బాహుబలి పేరుతో ప్రభాస్ కు టార్చర్!!!
- September 22, 2016 / 09:47 AM ISTByFilmy Focus
టాలీవుడ్ లో టాప్ హిట్స్ లో టాప్ ప్లేస్ లో ఉంటుంది ప్రభాస్ బాహుబలి. అయితే అదే క్రమంలో ఈ సినిమా విషయంలో ఎక్కడా కాంప్రమైస్ కాను అని అంటున్నాడు మన దర్శకుడు రాజమౌళి…విషయంలోకి వెళితే….బాహుబలి మొదటి పార్ట్ కలెక్షన్స్ పరంగా సూపర్ డూపర్ హిట్ అయినప్పటికీ అక్కడక్కడా విమర్శలు సైతం వచ్చాయి….యాక్షన్ సీన్స్ అంతర్జాతీయ స్థాయిలో లేవని, కధలో కాంటెంట్ కాస్త తగ్గింది అని, అలా రకరకాలుగా విమరస్లు వచ్చిన నేపధ్యంలో బాహుబలి2 విషయాలో వెనకడుగు వేయకుండా కష్టపడుతున్నాడు….కష్టపెడుతు న్నాడు కూడా…రాజమౌళి….‘బాహుబలి 2’ కు సంబంధించి ఒక సింగిల్ యాక్షన్ సీక్వెన్స్ కోసం ప్రభాస్ ను 30రోజుల నుంచి కష్ట పెడుతూనే ఉన్నాడు రాజమౌళి.అయితే ఆ ముప్పై రోజుల కష్టం ఫలితం కేవలం…తెరపై ఒక్క నిమిషమే….అవడం విశేషం.
ఇక ‘బాహుబలి 2’ లోని ప్రతి యాక్షన్ సన్నివేశాన్ని ప్రేక్షకులు ఊహించని విధంగా చిత్రీకరించాలి అని రాజమౌళి తపన పడుతున్న నేపధ్యంలో ఈ సింగిల్ సీక్వెన్స్ కోసం ప్రభాస్ చాల కష్టపడి 30రోజుల ట్రైనింగ్ తీసుకోవలసి వచ్చింది అని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. దాదాపుగా అక్టోబర్ ఎండింగ్ లో ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి ప్రభాస్ కు విశ్రాంతి కల్పిస్తాడు మన జక్కన్న…ఇక ఇప్పటికీ బిజినెస్ విషయంలో రాజమౌళి చాలా డిఫరెంట్ గా ఆలోచిస్తున్నాడు. ఎలా అయినా ఈ సినిమాకి 1000కోట్ల వసూళ్లు వచ్చేలా పక్కా ప్లాన్ చేస్తున్నాడు….అదే జరిగితే…ప్రబాస్ రికార్డులను టచ్ చెయ్యడానికి వేరే హీరోలకి….మరో దశాబ్దం పడుతుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు.
Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus















