Rajamouli, Allu Arjun: రాజమౌళి కామెంట్స్ ను బన్నీ సీరియస్ గా తీసుకుంటాడా..!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ మరియు పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప ది రైజ్’. డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఈ చిత్రం.విడుదలకి మరో వారం రోజులు కూడా లేదు కాబట్టి… ప్రమోషన్లను వేగవంతం చేసింది చిత్ర బృందం. ఈ క్రమంలో నిన్న అనగా డిసెంబర్ 12న హైదరాబాద్, యూసఫ్ గూడా గ్రౌండ్స్ లో ‘పుష్ప’ ప్రీ రిలీజ్ వేడుకని అభిమానుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు.అల్లు అర్జున్ గత చిత్రం ‘అల వైకుంఠపురములో’ ఈవెంట్ కూడా ఇదే ప్లేస్ లో జరిగింది.

ఆ చిత్రం ఇండస్ట్రీ రికార్డులని తిరగరాసింది.అదే సెటిమెంట్ తో ఈ వేడుకని కూడా అక్కడే నిర్వహించినట్టున్నారు. ఇదిలా ఉండగా.. ఈ వేడుకకి దర్శక ధీరుడు రాజమౌళి కూడా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంతేకాదు ఆయన ఓ 5 నిమిషాల పాటు అగ్రెసివ్ స్పీచ్ కూడా ఇచ్చారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ కు ఆయన ఓ వార్ణింగ్ కూడా ఇవ్వడం గమనార్హం. మేటర్ లోకి వెళ్తే.. “నాకు పర్సనల్ గా బాగా నచ్చిన దర్శకుడు సుకుమార్. తను ఈ రోజు ఇక్కడ లేడు ముంబై వెళ్ళాడు.. ‘పుష్ప’ ని మరింత బాగా చెక్కలని..!

ఆ విషయంలో కొద్దిగా బాధ అనిపిస్తుంది.మేము ఎప్పుడూ మాట్లాడుకుంటూనే ఉంటాము.నా సినిమా ప్రోమోస్ రిలీజ్ అయితే సుకుమార్ అదిరిపోయిందని మెసేజ్ చేస్తాడు. సుకుమార్ ప్రోమోస్ ఏమైనా రిలీజ్ అయితే నేను చించేసావ్ అని మెసేజ్ పెడుతుంటాను. అయితే ‘పుష్ప’ టీంకి నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను… ముఖ్యంగా బన్నీ నీకు. ఈ మధ్య నేను ముంబై వెళ్తే అక్కడి జనాలు నా సినిమా కంటే ముందు ‘పుష్ప’ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు చెప్పారు.

ఇంత మంచి కంటెంట్ నీ దగ్గర పెట్టుకుని ఇలా సైలెంట్ గా ఉండకూడదు. అక్కడ కూడా ‘పుష్ప’ ని బాగా ప్రమోట్ చెయ్యాలి. చెయ్యండి..! ఇందులో నా స్వార్ధం కూడా ఉంది.నా స్వార్ధమే కాదు.. సినీ పరిశ్రమ స్వార్ధం కూడా అనుకోవాలి. ‘పుష్ప’ తెలుగు సినిమా స్టామినాని.. ఎంత దూరం వెళ్తే అంత దూరం వెళ్ళనివ్వాలి.ఈ సినిమా కోసం ఇంత ఎఫర్ట్ పెట్టిన బన్నీ హ్యాట్సాఫ్ మెన్. ‘పుష్ప’ పెద్ద హిట్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అంటూ చెప్పుకొచ్చారు రాజమౌళి.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus