సూపర్ స్టార్ రజనీకాంత్ కు వందల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నా ఆయన సింపుల్ గా జీవనం సాగించడానికే ఆసక్తి చూపుతారనే సంగతి తెలిసిందే. రజనీకాంత్ సినిమా విడుదలై పాజిటివ్ టాక్ వస్తే ఏ రేంజ్ లో కలెక్షన్లు వస్తాయో జైలర్ సినిమా తో ప్రూవ్ అయింది. రాజకీయాల్లోకి వచ్చి ప్రజాసేవ చేయాలని రజనీకాంత్ భావించినా కొన్ని కారణాల వల్ల, వయస్సు సంబంధిత సమస్యల వల్ల ఆయన రాజకీయాల్లోకి రాలేదు.
అయితే పేదల కోసం మంచి చేయాలని భావించే హీరోలలో రజనీకాంత్ ఎప్పుడూ ముందువరసలో ఉంటారు. పేదలకు మేలు చేయాలని రజనీకాంత్ ఇటీవల కొన్న 12 ఎకరాల స్థలంలో ఆస్పత్రిని నిర్మించాలని ఫిక్స్ అయ్యారని కోలీవుడ్ మీడియా వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. వైరల్ అవుతున్న వార్తలు నిజమైతే మాత్రం రజనీకాంత్ అభిమానుల్లో మరింత మంచి పేరును సంపాదించుకునే అవకాశం అయితే ఉంది.
వైరల్ అవుతున్న వార్తలను రజనీకాంత్ కుటుంబ సభ్యులు ధృవీకరించాల్సి ఉంది. రజనీకాంత్ తన స్నేహితుడికి ఈ బాధ్యత్లను అప్పగించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఆస్పత్రిలో అందరికీ చికిత్స అందిస్తారని అయితే పేదవాళ్లు రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేకుండా చికిత్స తీసుకోవచ్చని తెలుస్తోంది. రజనీకాంత్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.
సౌత్ ఇండియాలో హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకునే హీరోలలో ఒకరైన రజనీకాంత్ వరుస ఫ్లాపుల వల్ల కెరీర్ ఇబ్బందుల్లో పడిన ప్రతిసారి బ్లాక్ బస్టర్ హిట్ సాధిస్తూ మార్కెట్ ను పెంచుకుంటున్నారు. నెక్స్ట్ లెవెల్ కాన్సెప్ట్ లతో రజనీకాంత్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లు మరింత సక్సెస్ సాధిస్తాయేమో చూడాలి. రజనీకాంత్ నటించిన లాల్ సలామ్ మూవీ ప్రేక్షకులను తీవ్రస్థాయిలో నిరాశపరిచింది. ఈ సినిమా నిర్మాతలకు సైతం ఊహించని స్థాయిలో నష్టాలను మిగిల్చింది. రజనీకాంత్ గెస్ట్ రోల్స్ చేసిన మెజారిటీ సినిమాలు ఆకట్టుకోలేదు. రాబోయే రోజుల్లో రజనీకాంత్ గెస్ట్ రోల్స్ కు దూరంగా ఉంటారేమో చూడాలి.