కోలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన రజనీకాంత్ ఈ మధ్య కాలంలో నటించిన సినిమాలలో ఎక్కువ సినిమాలు సక్సెస్ ను సొంతం చేసుకోలేదనే సంగతి తెలిసిందే. వరుసగా సినిమాలు ఫ్లాప్ అవుతున్నా రజనీకాంత్ మాత్రం నటుడిగా కెరీర్ ను కొనసాగిస్తున్నారు. రజనీకాంత్ ను అభిమానించే అభిమానుల సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతుందే తప్ప ఏ మాత్రం తగ్గడం లేదు. అయితే తాజాగా రజనీకాంత్ తమిళనాడు రాష్ట్ర గవర్నర్ తో సమావేశమయ్యారు. రజనీకాంత్ గవర్నర్ ను కలవడంతో అయన మళ్లీ రాజకీయాలపై దృష్టి పెట్టారని త్వరలోనే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారని వార్తలు వైరల్ అయ్యాయి.
అయితే రజనీకాంత్ రాజకీయాలపై తనకు ఏ మాత్రం ఆసక్తి లేదని వెల్లడించారు. రాజకీయాలతో సంబంధం ఉన్నవాళ్లను కలుసున్న రజనీకాంత్ పాలిటిక్స్ పై మాత్రం ఆసక్తి లేదని తేల్చి చెప్పడం గమనార్హం. గవర్నర్ ఆర్.ఎన్.రవితో భేటీ అయిన రజనీకాంత్ భేటీ అనంతరం ఈ విషయాలను వెల్లడించారు. సోమవారం రోజు ఉదయం చెన్నైలోని రాజ్ భవన్ లో గవర్నర్ ను కలిసిన రజనీకాంత్ 30 నిమిషాల పాటు గవర్నర్ తో వేర్వేరు అంశాల గురించి మాట్లాడారు.
మర్యాదపూర్వకంగానే తాను గవర్నర్ ను కలిశానని ఆయన చెప్పుకొచ్చారు. ఈ భేటీలో నేను రాజకీయాల గురించి కూడా చర్చించానని ఆయన చెప్పుకొచ్చారు. అయితే గవర్నర్ తో మాట్లాడిన విషయాలను వెల్లడించడం మాత్రం సాధ్యం కాదని ఆయన చెప్పుకొచ్చారు. 2017 సంవత్సరంలో రజనీకాంత్ పాలిటిక్స్ లోకి రావాలని అనుకున్నారు.
పొలిటికల్ పార్టీ పెట్టి ఆ పార్టీ ద్వారా అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయాలని ఆయన అనుకున్నారు. కొన్ని సంవత్సరాల పాటు రాజకీయాల దిశగా ఆయన అడుగులు పడ్డాయి. అయితే 2020 సంవత్సరం డిసెంబర్ నెలలో ఈ నిర్ణయం విషయంలో ఆయన వెనక్కు తగ్గారు. అనారోగ్య సమస్యలు, కరోనా పరిస్థితుల వల్ల రాజకీయాల్లోకి రానని ఆయన చెప్పుకొచ్చారు.