తలైవార్ రజనీ కాంత్, ఏ పేరు వింటేనే అభిమానం అన్న పదానికి అర్ధం ఆవిష్కృతం అవుతుంది. ఏ పేరు వింటే చాలు కొన్ని కోట్ల అభిమానుల గుండెలు అభిమానంతో ఊగిపోతాయి. ఇంకా చెప్పాలి అంటే అభిమానులకు ఆయన ఒక దేవుడు అంటే అతిశయోక్తి కాదు. అయితే అలాంటి వ్యక్తిని ఛంపేస్తాం అంటూ బెదిరింపులు రావడం ఇప్పుడు కలకలం రేపుతుంది. అసలు ఏమయింది? రజనిని ఛంపాలి అన్న ఆలోచన ఎవరిది? అన్న విషయాలు పరిశీలిస్తే, అప్పుడెప్పుడో దర్శకుడు మణిరత్నం చెన్నై వాడైన ముంబై డాన్ ముదలియార్ వరదరాజన్ కథను ‘నాయకుడు’గా కమల్‌తో తీశాడు. ఆది అప్పుడు సూపర్ హిట్ కావడమే కాదు, ఎంతో సెన్సేషన్ ను కూడా క్రియేట్ చేసింది. అయితే ముదలియార్‌కి శిష్యుడు, ఆయన కనుసైగల్లో పెరిగిన మరో చెన్నై వారసత్వమైన ముంబై గ్యాంగ్‌స్టర్, మాఫియా డాన్, రియల్‌ఎస్టేట్, హవాలా, మనీ లాండరింగ్, మత్తు పదార్దాలు, సినిమాలకు ఫైనాన్స్, బాంబు పేలుళ్లలలో పేరున్న హాజీమస్తాన్ జీవిత చరిత్రను ఇప్పుడు ఇండియన్ సూపర్‌స్టార్ రజనీ హీరోగా ‘కబాలి’ ఫేం రంజిత్‌పా దర్శకత్వంలో రజనీ అల్లుడు ధనుష్ నిర్మాతగా రజనీ 161వ చిత్రంగా నిర్మిస్తున్నాడని ప్రచారం బయటకు వచ్చింది.
ఇప్పటికే ఈ లుక్ పలువురిని ఆకట్టుకుంటోంది. అదే క్రమంలో చిన్ననాటి నుంచి పేదరికంతో నానా అగచాట్లు పడిన హాజీమస్తాన్‌కి విలాసవంతమైన జీవితం గడపాలని కోరిక. దాంతో డాన్‌గా మారి ఇంటర్నేషనల్ మాఫియాతో కూడా లింక్‌లు పెట్టుకున్నాడు అదీ సింపల్ గా చెప్పాలి అంటే హాజీ మస్తాన్ లైఫ్ స్టోరీ. అయితే హాజీ మస్తాన్ వారసుడినని చెప్పుకునే ముంబైకి చెందిన డాన్ వలార్‌పులగమ్ అనే వ్యక్తి రజనీని ఈ చిత్రం తీయకూడదని, తీసినా కూడా తప్పుగా చూపకూడదని, కావాలంటే వాస్తవాలు తానే ఇస్తానని, ఆయనో గొప్ప మనిషి అని, కాదని సినిమా తీస్తే ప్రాణాలు తీయడానికైనా వెనుకాడమని బెదిరిస్తూ రాసిన లేఖ ముంబైలోని ఓ మీడియా ప్రతినిధికి దొరకడంతో ఈ వ్యవహారం బయటకు వచ్చింది. ఈ వార్త బయటకు రావడంతో ఒక్కసారిగా అలెర్ట్ అయ్యింది తమిళ భజన సంగం. రజనీపై ఎవరైనా పిచ్చి వ్యాఖ్యలు చేస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు అని కౌంటర్ అట్యాక్స్ స్టార్ట్ చేసింది. అయితే సినిమా ఇంకా మొదలు కాలేదు, అసలు సినిమా కధలో ఏముందో తెలీదు, అప్పుడే ఇంత ఆవేశం ఎందుకో? చూద్దాం మన రంజిత్‌పా ఏ కోణంలో సినిమాను తీస్తాడో.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.