Peddanna Trailer: మాస్ ఆడియన్సే టార్గెట్ గా ‘పెద్దన్న’..!

సూపర్ స్టార్ రజినీకాంత్ నుండీ రాబోతున్న తాజా చిత్రం ‘అన్నాత్తే’.తెలుగులో ‘పెద్దన్న’ పేరుతో విడుదల కాబోతుంది. తెలుగులో ‘శౌర్యం’ ‘శంఖం’ ‘దరువు’ వంటి చిత్రాలు తెరకెక్కించి అటు తర్వాత తమిళంలో వరుస హిట్ సినిమాలను తెరకెక్కించిన శివ ఈ చిత్రానికి దర్శకుడు. నయనతార హీరోయిన్ కావడం విశేషం. దీపావళి కానుకగా విడుదల కాబోతున్న ఈ చిత్రానికి సంబంధించి టీజర్ ఇటీవల విడుదలై మంచి అంచనాలను క్రియేట్ చేసింది. తాజాగా ట్రైలర్ ను కూడా విడుదల చేశారు.

‘నువ్వెవరనేది నువ్వేనకేసుకున్న ఆస్తిలోనో నీ చుట్టూ ఉన్న వాళ్ళకి నీ మీదున్న భయం లోనో లేదు’ అనే పవర్ ఫుల్ డైలాగ్ తో ట్రైలర్ మొదలైంది. కీర్తి సురేష్ రజినీ చెల్లెలి పాత్రలో నటిస్తుండగా నయన్ తార హీరోయిన్ గా కనిపిస్తుంది. కీలక పాత్రల్లో మీనా, ప్రకాష్ రాజ్, కుష్బూ వంటి వారు కనిపిస్తున్నారు. పవర్ ఫుల్ విలన్ పాత్రలో జగపతి బాబు కనిపిస్తున్నాడు. ఈ చిత్రం కథ మొత్తం కీర్తి సురేష్ పాత్ర చుట్టూనే తిరుగుతుంది అనే హింట్ ఇచ్చారు.

‘న్యాయంగాను ధైర్యంగానూ ఓ ఆడపిల్ల ఉంటే ఆ దేవుడే దిగొచ్చి తనకి తోడుగా ఉంటాడు’ అనే డైలాగ్ అలాగే ఇమ్మాన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్క్రోర్, యాక్షన్ ఎలిమెంట్స్ వంటివి ట్రైలర్ లో హైలెట్ గా నిలిచాయి. మాస్ ఆడియెన్స్ కు కనెక్ట్ అయ్యే అంశాలు ఈ చిత్రంలో ఎక్కువ ఉన్నాయని ట్రైలర్ చెప్పకనే చెప్పింది. ట్రైలర్ బానే ఉంది. మీరు కూడా ఓ లుక్కేయండి :

నాట్యం సినిమా రివ్యూ & రేటింగ్!


సంకల్ప బలమే ‘మురారి’ ని క్లాసిక్ చేసింది, 20 ఏళ్ళ ‘మురారి’ వెనుక అంత కథ నడిచిందా…!
ఫ్యాక్షన్ సినిమాకి సరికొత్త డెఫినిషన్ చెప్పిన కృష్ణవంశీ ‘అంతఃపురం’…!
టాలీవుడ్‌ టాప్‌ భామల రెమ్యూనరేషన్‌ ఎంతంటే?

Share.