Rakul preet Singh: అలాంటి వార్తలు చదువుతుంటే కోపం వస్తుంది!

కరోనా సమయంలో తిండి దొరక్క, సరైన ట్రీట్మెంట్ చేయించుకోలేక ప్రజలంతా కష్టాలు పడుతుంటే.. మరోపక్క మాత్రం అత్యాచారం కేసులు తగ్గడం లేదు. ఈ విషయంపై రకుల్ ఆవేదన వ్యక్తం చేసింది. రీసెంట్ గా మనేసర్ లో జరిగిన ఓ రేప్ కేసు గురించి చదివినట్లు.. తన రక్తం మరిగిపోయిందని.. ఓవైపు కరోనాతో ప్రజలు చచ్చిపోతుంటే మరోవైపు కొంతమంది ఇలా ప్రవర్తిస్తుంటే చాలా కోసం వస్తుందని రకుల్ చెబుతుంది. ఇలాంటి వార్తలు చదివినప్పుడు మనం అసలు మనుషులమేనా అనే సందేహం కలుగుతుందని తన కోపాన్ని వ్యక్తం చేసింది.

ఈ కరోనా కష్టకాలంలో కొంతమంది ప్రజల్లో మానవత్వం బయటకొస్తుందని.. చాలామంది తమకు తోచిన రీతిలో సాయం చేస్తున్నారని.. అదే సమయంలో కొంతమంది ఇలా అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని బాధపడింది రకుల్. మన స్థాయి ఏంటి..? మనం ఏం సాధించాం..? అనే విషయాలను మర్చిపోయి.. సమాజంలో ఇతర వ్యక్తులు కూడా మనతోనే ఉన్నారనే విషయాన్ని గ్రహించాలని.. అందరినీ సమానంగా చూడగలగాలని.. అప్పుడే ఈ సమాజం బాగుపడుతుందని చెప్పుకొచ్చింది.

ప్రస్తుతం రకుల్ కరోనా రోగుల కోసం ఫండ్ రైజింగ్ కార్యక్రమం మొదలుపెట్టింది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో తను మాత్రమే చేసే సాయం సరిపోదని.. అందరూ కలిసి సాయం చేయాల్సిన సమయం వచ్చిందని చెప్పుకొచ్చింది.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus