రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ ఆర్ ఆర్’ అనే సినిమా చేసి తన కెరీర్లో మరో భారీ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు రాంచరణ్. ఆ వెంటనే తన తండ్రి చిరంజీవితో కలిసి ‘ఆచార్య’ సినిమా చేశాడు. అప్పటివరకు ప్లాప్ అంటూ లేని కొరటాల శివ దర్శకుడు. అయితేనేం సినిమా డిజాస్టర్ అయ్యింది. నిజానికి ఈ సినిమాలో చరణ్ పాత్ర 15 నిమిషాలు అని మొదట తెలిపారు. కానీ అభిమానుల పేరు చెప్పి ఆ పాత్రను 45 నిమిషాలు చేశారు.
ఈ రకంగా మల్టీస్టారర్ అప్పీల్ వస్తుంది అని చిరు భావించి ఉంటారు. అయినా సరే ఈ సినిమాకి మొదటి రోజు నుండే మినిమం ఓపెనింగ్స్ కూడా నమోదు కాలేదు. రామ్ చరణ్ సొంత బ్యానర్ అలాగే మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. ఫుల్ రన్లో ఈ మూవీ రూ.50 కోట్ల షేర్ ను కూడా నమోదు చేయలేకపోయింది. ఇదిలా ఉండగా.. తాజాగా చరణ్ హెచ్ టి లీడర్ షిప్ సమ్మిత్ కు హాజరయ్యాడు.
ఇందులో అక్షయ్ కుమార్ కూడా పాల్గొన్నాడు. ఈ క్రమంలో చరణ్ ‘ఆచార్య’ రిజల్ట్ పై స్పందించాడు. ” ‘ఆర్ఆర్ఆర్’ వంటి సూపర్ హిట్ సినిమా తర్వాత నేను ఓ సినిమాలో గెస్ట్ అప్పియరెన్స్ ఇవ్వడం జరిగింది. అయినా సరే ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి ఆ సినిమాని చూడలేదు. ప్రేక్షకులు థియేటర్ కు రావడానికి ఇంట్రెస్ట్ చూపించాలి అంటే స్ట్రాంగ్ కంటెంట్ మరీ ముఖ్యంగా వారిని ఆకట్టుకునే కంటెంట్ ఉండాలి.
కంటెంట్ అనేది ప్రధానం. ప్రేక్షకుల టేస్ట్ ఇప్పుడు చాలా మారింది” అంటూ రాంచరణ్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం చరణ్ .. దిల్ రాజు నిర్మాణంలో శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ 60 శాతం పూర్తయింది. ఈ మూవీలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. మరో హీరోయిన్ గా అంజలి కూడా నటిస్తుండడం విశేషం.