టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన రామ్ చరణ్ కు ప్రేక్షకుల్లో అంచనాలను మించి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండగా ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తున్న రామ్ చరణ్ వేర్వేరు కారణాల వల్ల ఈ సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించి స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. దర్శకుడు శంకర్ విషయంలో దిల్ రాజు సైతం అసంతృప్తితో ఉన్నారని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతుండటం గమనార్హం. ఈ సినిమా షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేసి బుచ్చిబాబు డైరెక్షన్ లో నటించాలని రామ్ చరణ్ భావిస్తుండగా రామ్ చరణ్ అనుకున్న ప్రకారం సినిమాల షూటింగ్ జరుగుతుందో లేదో చూడాల్సి ఉంది.
అయితే పౌరాణిక సినిమాలలో నటించి మెప్పించాలని రామ్ చరణ్ కోరిక అని తెలుస్తోంది. రాబోయే రోజుల్లో పౌరాణిక సినిమాలలో నటించే అవకాశం వస్తే మాత్రం ఆ అవకాశాన్ని వదులుకోకూడదని రామ్ చరణ్ భావిస్తున్నారట. మరి రామ్ చరణ్ కోరుకున్న విధంగా అలాంటి పాత్రలు దక్కుతాయేమో చూడాల్సి ఉంది. రామ్ చరణ్ వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ కెరీర్ ను కొనసాగిస్తున్నారు.
రాబోయే రోజుల్లో మరిన్ని భారీ విజయాలు దక్కేలా చరణ్ కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు. నిదానమే ప్రధానం అనే సూత్రాన్ని ఫాలో అవుతూ కెరీర్ పరంగా సక్సెస్ సాధించే దిశగా రామ్ చరణ్ అడుగులు వేస్తున్నారు. రామ్ చరణ్ కు రాబోయే రోజుల్లో ఏ రేంజ్ లో సంచలనాలు సృష్టిస్తారో చూడాల్సి ఉంది. కెరీర్ పరంగా ఒక్కో మెట్టు ఎదుగుతున్న రామ్ చరణ్ (Ram Charan) ప్రతి సినిమా పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ సాధించేలా జాగ్రత్త పడాల్సి ఉంది.
యంగ్ జనరేషన్ మెగా హీరోలలో రామ్ చరణ్ స్థాయిలో ఎవరూ సక్సెస్ సాధించలేదు. రామ్ చరణ్ 100 కోట్ల రూపాయల పారితోషికం అందుకునే హీరోలలో ఒకరిగా ఉన్నారు.